Salaar CeaseFire Telugu Trailer : ఎట్టకేలకు విడుదలైన సలార్ ట్రైలర్…కే.జి.ఎఫ్ ను మించిందిగా…

Salaar CeaseFire Telugu Trailer  : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ టీం నుంచి శుభవార్త రానే వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సినీ బృందం విడుదల చేసింది. అయితే ముందుగా ఎలాంటి ప్రకటన ఇవ్వకుండానే సడన్ గా ట్రైలర్ రావడం గమనార్హం. ఇక ఇప్పటికే పదిసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా […]

  • Published On:
Salaar CeaseFire Telugu Trailer : ఎట్టకేలకు విడుదలైన సలార్ ట్రైలర్…కే.జి.ఎఫ్ ను మించిందిగా…

Salaar CeaseFire Telugu Trailer  : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ టీం నుంచి శుభవార్త రానే వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సినీ బృందం విడుదల చేసింది. అయితే ముందుగా ఎలాంటి ప్రకటన ఇవ్వకుండానే సడన్ గా ట్రైలర్ రావడం గమనార్హం. ఇక ఇప్పటికే పదిసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు 20 రోజులు ముందుగానే ఈరోజు సినిమా యొక్క ట్రైలర్ను విడుదల చేశారు.

ఇక ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా , తాజాగా ట్రైలర్ తో సినిమాపై భారి అంచనాలను నెలకొల్పారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులు అయితే ఎలా ఉంటుందనే సారాంశంలో మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ నీల్ కూడా వెల్లడించారు. అయితే అక్టోబర్ 28న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వలన చాలా ఆలస్యమైంది. దీంతో తాజాగా ప్రశాంత్ నీల్ డిసెంబర్ డేట్ ను ఫిక్స్ చేయడం జరిగింది.

ఇక టీజర్ ను పరిశీలిస్తే ప్రభాస్ ముఖం సరిగా చూపించకుండా ఎలివేషన్ లో చూపించారు. ఇక ట్రైలర్లోనే దాదాపు మెయిన్ లీడ్స్ అందరిని చూపించేశారు. ఇక ప్రభాస్ ఉన్న యాక్షన్స్ సీన్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. అలాగే రవి బసృర్ సంగీతం బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయింది. ఇక ఈ టైలర్ చూస్తుంటే థియేటర్లో దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది.