“BRO” Pre-release Event : ” బ్రో ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం….తేదీను ఖరారు చేసిన నిర్మాత…

“BRO” Pre-release Event : ప్రస్తుతం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ” బ్రో ” …. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తొలిసారి కలిసిన నటించబోతున్న సినిమా ఇది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన ‘ వినోద సిత్తం ‘ అనే సినిమా ఆధారంగా ” బ్రో ” సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు […]

  • Published On:
“BRO” Pre-release Event :  ” బ్రో ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం….తేదీను ఖరారు చేసిన నిర్మాత…

“BRO” Pre-release Event : ప్రస్తుతం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ” బ్రో ” …. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తొలిసారి కలిసిన నటించబోతున్న సినిమా ఇది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన ‘ వినోద సిత్తం ‘ అనే సినిమా ఆధారంగా ” బ్రో ” సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు రాస్తున్నారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ఈ బ్రో సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .

everything-is-ready-for-the-bro-free-release-event-the-producer-has-finalized-the-date

ఇక ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరకు రావడంతో సినీ నిర్మాణ సంస్థ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీర హీరోయిన్లు మరియు దర్శకుడు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇటీవల చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సినిమా విషయాలను పంచుకుంటూ ‘ బ్రో ‘ ట్రైలర్ మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ 21 లేదా 22 తేదీన విడుదల చేస్తామని, ఈనెల 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. బ్రో సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నట్లు నిర్మాత చెప్పుకొచ్చారు.

everything-is-ready-for-the-bro-free-release-event-the-producer-has-finalized-the-date

అలాగే బ్రో సిని ప్రయాణం గురించి నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ…తాము ఒక మంచి ప్రాజెక్టు ను దృష్టిలో పెట్టుకొని ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ ‘వినోద సిత్తం’ అనే సినిమాను తెలుగు రీమేక్ గా తీస్తే బాగుంటుందని సూచించారట. అలా ఈ సినిమాను తెరపైకి ,తీసుకురావడం జరిగింది. అలాగే వారి బ్యానర్ పై రూపొందుతున్న అతిపెద్ద ప్రాజెక్టులో బ్రో సినిమా ఒకటి . తమిళ్ సినిమాతో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉంటుందని నిర్మాత చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు , కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తుందని , ఒరిజినల్ తమిళ్ సినిమా చూసిన వారికి కూడా ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని విశ్వ ప్రసాద్ తెలియజేశారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పది నిమిషాల వరకు మాత్రమే కనిపిస్తారని చెప్పారు.