Renu Desai : పెళ్లికి ముందే ఎన్నో కష్టాలు పడ్డా…ఆడదానిగా పుట్టడమే నా దురదృష్టమా…రేణు దేశాయ్..

Renu Desai : రేణు దేశాయ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ తో ప్రేమ, పెళ్లి , విడాకులు ఆపే ఆమె పడిన కష్టాలు. అయితే పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ తన పిల్లలతోనే జీవితాన్ని గడుపుతూ వచ్చింది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నటి రేణు దేశాయ్ వెండితెరపై కనిపించనుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ వంశీ నిర్మిస్తున్న ” టైగర్ […]

  • Published On:
Renu Desai : పెళ్లికి ముందే ఎన్నో కష్టాలు పడ్డా…ఆడదానిగా పుట్టడమే నా దురదృష్టమా…రేణు దేశాయ్..

Renu Desai : రేణు దేశాయ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ తో ప్రేమ, పెళ్లి , విడాకులు ఆపే ఆమె పడిన కష్టాలు. అయితే పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ తన పిల్లలతోనే జీవితాన్ని గడుపుతూ వచ్చింది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నటి రేణు దేశాయ్ వెండితెరపై కనిపించనుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ వంశీ నిర్మిస్తున్న ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాలో ఒ సామాజిక వేత్త గా ” హేమలత లవణం ” గా రేణు దేశాయ్ కనిపించబోతున్నారు. 1970 ప్రాంతంలో స్టువర్ట్ పురంలో బాగా పేరు మోసిన గజదొంగ యొక్క నిజ జీవిత కథ ఆధారంగా తలకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగాయి. ఇది ఇలా ఉండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

even-though-i-faced-many-hardships-before-marriage-is-it-my-bad-luck-to-be-born-as-a-female-renu-desai

ఈ నేపథ్యంలో ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నా జీవితంలోకి రాకముందు నుంచే నాకు కష్టాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మా అమ్మానాన్న కొడుకు పుట్టాలని భావించారు. కానీ వారికి నేను పుట్టాను. ఇలా మా ఇంట్లోనే నేను లింగ వివక్షకు గురయ్యాను. చాలామంది నా పేరు వినగానే పెళ్లి విడాకుల గురించి ప్రస్తావిస్తారు కానీ నా చిన్నతనం నుండి నేను ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నాను.అలాగే మా నాన్న కోరిక ప్రకారం కొడుకు పుట్టలేదని మూడు రోజుల దాకా నా తండ్రి నా మొహం కూడా చూడలేదట. ఇక ఈ విషయం ఊహ తెలిసి వచ్చాక మా అమ్మ నాకు చెప్తే విని చాలా బాధపడ్డా. ఆ బాధ ఇప్పటికీ నాలో ఉంది. ఆ తర్వాత ఏడాదిలోనే మా తమ్ముడు పుట్టాడు.

even-though-i-faced-many-hardships-before-marriage-is-it-my-bad-luck-to-be-born-as-a-female-renu-desai

ఇక వాడిని మహారాజుల పెంచారు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఎలాంటి పరిస్థితుల నడుమ పెరిగానో. ఇలాంటి వివక్షత కొన్నిచోట్ల ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది అంటూ రేణు ఎమోషనల్ అయ్యారు. అంతేకాక మా కుటుంబంలో ఆడబిడ్డని ఒకలాగా మగవారిని ఒకలాగా చూస్తారని, నా జీవితంలో తల్లిదండ్రులు ఉన్న వారి ప్రేమను పొందలేకపోయానని రేణు ఎంతో బాధపడుతూ చెప్పుకొచ్చారు. నా జీవితంలో విడాకులు కంటే కూడా నన్ను ఎక్కువ బాధ పెట్టింది అదే అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. అందుకే నా బిడ్డలకు రెట్టింపు ప్రేమను పంచుతున్నాను. నాలాగా వారు అవ్వకూడదు అనుకుంటున్నాను. అందుకే వారిద్దరి కోసం ఎంతటి కష్టమైనా సరే భరిస్తాను అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.