Upasana Kamineni : మెగా ఇంట్లో దసరా సంబరాలు… క్లింకారాతో కలిసి బతుకమ్మ వేడుకలు…

Upasana Kamineni : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు చెప్పలేనంత సంబరం. కేవలం ఆడవారికి మాత్రమే కాదు చిన్న నుండి పెద్దల వరకు అందరికీ ఈ పండుగ ఎంతో ప్రీతిదాయమైనది. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ నవరాత్రి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ నవరాత్రుల్లోనే చివరి రోజున సద్దుల బతుకమ్మ గా పిలుస్తారు. ఇక ఈరోజు అత్యంత పెద్ద బతుకమ్మను తయారుచేసి […]

  • Published On:
Upasana Kamineni : మెగా ఇంట్లో దసరా సంబరాలు… క్లింకారాతో కలిసి బతుకమ్మ వేడుకలు…

Upasana Kamineni : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు చెప్పలేనంత సంబరం. కేవలం ఆడవారికి మాత్రమే కాదు చిన్న నుండి పెద్దల వరకు అందరికీ ఈ పండుగ ఎంతో ప్రీతిదాయమైనది. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ నవరాత్రి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ నవరాత్రుల్లోనే చివరి రోజున సద్దుల బతుకమ్మ గా పిలుస్తారు. ఇక ఈరోజు అత్యంత పెద్ద బతుకమ్మను తయారుచేసి పిల్ల జల్ల అందరూ బతుకమ్మ చుట్టూ చేరి వెళ్లి రావమ్మ ఏడాదికి మళ్ళీ రావమ్మా అంటూ సాగనంపుతారు. అయితే ఈ బతుకమ్మ పండుగలను కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు.

మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇలాంటి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాక ఇప్పుడు మెగా ఇంట్లో మనవరాలు అడుగుపెట్టడంతో ఈ పండుగను మరింత రెట్టింపు సంతోషంతో జరుపుకున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితిని కూడా ఎంతో ఘనంగా జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు బతుకమ్మ పండుగను కూడా చాలా ఘనంగా జరిపించారు. సేవా సమాజ్ బాలిక నిలయం లో చిన్నారులతో కలిసి ఉపాసన కొనిదల ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఉపాసన కొణిదల క్లింకారని ఎత్తుకొని బతుకమ్మ ఆడటంతో దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…జనాలు నాకు శక్తినిస్తే కుటుంబం నాకు బలాన్ని ఇచ్చిందని….ఎంతో ప్రత్యేకమైన ఈ దసరా పండుగ రోజున అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన శక్తిని మనలో నింపుకుందామంటూ ,సానుకూల దృక్పథాలను పెంచుదాం అంటూ ఉపాసన క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే బాలిక నిలయంలో దసరా వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నామంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి దంపతులు మరియు రామ్ చరణ్ ,సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొనడం జరిగింది.