Viral Promo : డ్రాఫర్ టు వల్లి ….అసలు ఎవరిని వదలలేదుగా….అందరికీ 90mm రాడ్ దింపిన కమెడియన్ సత్య…

Viral Promo  : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ కమెడియన్ లలో సత్య ఒకరు. సత్య కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించి మంచి అవకాశాలను పొందినప్పటికీ అంత గుర్తింపు మాత్రం రాలేదు.ఇక తాజాగా కమెడియన్ సత్య రంగబలి అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో సత్య స్పెర్మ్ ను తేనె అమ్మినట్లు రోడ్డు మీద అమ్మేద్దాం అంటూ…స్పెషల్ ఎట్రాక్షన్ […]

  • Published On:
Viral Promo : డ్రాఫర్ టు వల్లి ….అసలు ఎవరిని వదలలేదుగా….అందరికీ 90mm రాడ్ దింపిన కమెడియన్ సత్య…

Viral Promo  : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ కమెడియన్ లలో సత్య ఒకరు. సత్య కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించి మంచి అవకాశాలను పొందినప్పటికీ అంత గుర్తింపు మాత్రం రాలేదు.ఇక తాజాగా కమెడియన్ సత్య రంగబలి అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో సత్య స్పెర్మ్ ను తేనె అమ్మినట్లు రోడ్డు మీద అమ్మేద్దాం అంటూ…స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు . అయితే ఈ సినిమా జూలై 7న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది..ఈ క్రమంలో సినీ బృందం సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో కమెడియన్ సత్య ప్రముఖ జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ చేసిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకెళితే…

“రంగబలి” సినిమా విడుదల ఇంకొక వారం రోజులు ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. దీంతో ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నాగశౌర్య మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలను ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూను ఏర్పాటు చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో కేవలం నాగశౌర్య మరియు కమెడియన్ సత్య మాత్రమే ఉంటారు. కమెడియన్ సత్య హీరో నాగ శౌర్యను ఇంటర్వ్యూ చేస్తాడు. అయితే కొన్ని షో లు మరియు ప్రెస్ మీట్ల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఐదుగురు జర్నలిస్టులను సత్య ఇమిటేట్ చేశాడు.

ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ జాఫర్, గ్రేట్ ఆంధ్ర జర్నలిస్టు మూర్తి, సంతోషం సురేష్ కొండేటి , టీవీ9 న్యూస్ ప్రజెంటర్ దేవి నాగవల్లి ని సత్య ఇమిటేట్ చేశాడు. ఓపెన్ హార్ట్ విత్ సత్య, ఇంటర్వ్యూ విత్ దేవి ప్రియ , ఇట్లు మీ డ్రాఫర్ , ప్రెస్ మీట్ విత్ నరేష్ మండేటి , ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ పల్లి , ఇలా ఐదు భాగాలుగా ఈ ఇంటర్వ్యూ ను నిర్వహించారు. ఇక దీనిలో సత్య అచ్చం వారిని దింపేశాడు. సత్య వారిని అచ్చుగుద్దినట్లుగా చాలా అద్భుతంగా ఇమిటేట్ చేయడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాక ప్రోమో చివరి లో దేవీ నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ అరిచిన విజువల్స్ ప్రోమో మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. దీంతో ప్రేక్షకులు ఈ ప్రోమో కి ఫిదా అయిపోతున్నారు.