Nabha Natesh : ఈ చిన్ననాటి ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..ఇప్పుడు మామూలుగా లేదుగా..

Nabha Natesh : జీవితంలో అవకాశాలు అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడే వాటిని సద్వినియోగపరచుకోవాలి. లేకపోతే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. అయితే పైన ఫోటోలు కనిపిస్తున్న ఆ చిన్నారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హీరోయిన్ గా ఎదిగింది. తన మొదటి సినిమానే స్టార్ హీరోతో నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్ లోనే […]

  • Published On:
Nabha Natesh : ఈ చిన్ననాటి ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..ఇప్పుడు మామూలుగా లేదుగా..

Nabha Natesh : జీవితంలో అవకాశాలు అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడే వాటిని సద్వినియోగపరచుకోవాలి. లేకపోతే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. అయితే పైన ఫోటోలు కనిపిస్తున్న ఆ చిన్నారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హీరోయిన్ గా ఎదిగింది. తన మొదటి సినిమానే స్టార్ హీరోతో నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్ లోనే ఏకంగా ఏడు సినిమాలలో నటించింది. ఆ తర్వాత ఆక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇప్పుడు మరల తిరిగి వచ్చింది కానీ ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆమెను పట్టించుకోవడం లేదని చెప్పాలి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..

do-you-remember-who-is-the-heroine-in-this-childhood-photo

do-you-remember-who-is-the-heroine-in-this-childhood-photo

వివరాల్లోకెళితే .. కర్ణాటకలోని శృంగేరి అనే ప్రాంతంలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. చిన్నప్పటినుండే యాక్టింగ్ పైన మక్కువ ఉన్న ఈ భామ , స్కూల్ ఏజ్ లోనే నాటకాలు డాన్స్ చేస్తూ గుర్తింపు సాధించింది. అలా చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అంతేకాక పలు రకాల యాడ్స్ లో నటించి ఫేమ్ తెచ్చుకుంది. మరి ఆమె ఎవరో కాదు నభా నటేష్.కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో “వజ్రకాయ” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత కన్నడలో “లీ” “సాహెబా” అనే సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత నన్ను దోచుకుందువటే అని సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

do-you-remember-who-is-the-heroine-in-this-childhood-photo

do-you-remember-who-is-the-heroine-in-this-childhood-photo

ఆ తరువాత మరో ఆరు తెలుగు సినిమాలో కూడా హీరోయిన్ గా నభా చేసింది. తెలుగులో దాదాపు 7 సినిమాలు చేయగా అందులో ఒకటి మాత్రం సూపర్ హిట్ట్ సాధించింది. ఆ సినిమానే రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో నాభా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది. ఇంకా తర్వాత 2021 నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాలో చివరగా కనిపించింది . ఇక ఆ తర్వాత ఆమెకు రోడ్ యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ దర్శక నిర్మాతల కంటపడేలా చూస్తోంది. మరి ఆమె ప్రయత్నానికి తగిన ఫలితాలు వస్తాయా లేదో చూడాలి.