Dimple Hayati – Venu Swami : వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్న డింపుల్ హయాతి…వ్యక్తిగత సమస్యల నుండి బయట పడేందుకా….

Dimple Hayati – Venu Swami : తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని ఏళ్లుగా వేణు స్వామి పేరు తెగ వినిపిస్తుంది. అయితే వేణు స్వామి అనే వ్యక్తి సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఫేమస్ అయ్యాడు. హీరో హీరోయిన్ల భవిష్యత్తు ఇది అంటూ వేణు స్వామి చేసే కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. అంతేకాక అతను చెప్పినవి కొన్ని జరగడంతో ఇతని పేరు మరింత పాపులర్ అయింది. అయితే ఇటీవల రాంచరణ్ మరియు ఉపాసన దంపతులకు పాప […]

  • Published On:
Dimple Hayati – Venu Swami : వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్న డింపుల్ హయాతి…వ్యక్తిగత సమస్యల నుండి బయట పడేందుకా….

Dimple Hayati – Venu Swami : తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని ఏళ్లుగా వేణు స్వామి పేరు తెగ వినిపిస్తుంది. అయితే వేణు స్వామి అనే వ్యక్తి సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఫేమస్ అయ్యాడు. హీరో హీరోయిన్ల భవిష్యత్తు ఇది అంటూ వేణు స్వామి చేసే కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. అంతేకాక అతను చెప్పినవి కొన్ని జరగడంతో ఇతని పేరు మరింత పాపులర్ అయింది. అయితే ఇటీవల రాంచరణ్ మరియు ఉపాసన దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. అయితే పాప పుట్టినా తేదీ మరియు సమయాన్ని బట్టి వేణు స్వామి జాతకం చెప్పాడు. పాపది చాలా దివ్యమైన జాతకమని తల్లిదండ్రులను మించి ఎదుగుతుందని వేణు స్వామి తెలియజేశాడు. వీటితోపాటు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటుందని తెలియజేశాడు.

dimple-hayati-who-performed-special-pooja-with-venu-swami

ఇదిలా ఉంటే వేణు స్వామి ని నమ్మేవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అంతేకాక కొందరు అతని చేత పూజలు జరిపించుకుంటే కెరియర్ సక్సెస్ అవుతుందని నమ్ముతారు. అయితే స్టార్ హీరోయిన్ రష్మిక కూడా వేణు స్వామి నివాసంలో చాలాసార్లు ప్రత్యేక పూజలు జరిపించుకుంది. దీంతో రష్మిక ఇంతలా ఎదగడానికి వేణు స్వామి కారణమని కూడా అంటారు. ఆ మధ్య హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి నివాసంలో కొన్ని ప్రత్యేక పూజలు చేయించుకుంది. అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి మరో ముద్దుగుమ్మ చేరింది. ఇండస్ట్రీలో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన డింపుల్ హయాతి వేణు స్వామితో రహస్య పూజలు నిర్వహించింది.

ఇక దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం డింపుల్ హయాతి తన వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఇటీవల ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే డింపుల్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాక ఇప్పుడు డింపుల్ హయతి నటించిన రెండు సినిమాలు కూడా నిరాశనే మిగిలించాయి. దీంతో తన వ్యక్తిగత సమస్యల నుండి బయటపడేందుకు డింపుల్ ఆయాతి ఇలా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నట్లు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.