Deepti Sunayana : కొత్త ఇల్లు కొన్న దీప్తి సునయన .. అంత డబ్బు ‘ ఎలా ‘ సంపాదించావ్ తల్లీ !

Deepti Sunayana : యూట్యూబర్ దీప్తి సునయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీప్తి యూట్యూబ్ లో బాగా వీడియో సాంగ్స్ చేస్తూ మరింత పాపులారిటీని పెంచుకుంది. డాన్స్ వీడియోస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 2 లో చేసిన సంద‌డి అంతా ఇంత కాదు. క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ అంద‌రినీ […]

  • Published On:
Deepti Sunayana : కొత్త ఇల్లు కొన్న దీప్తి సునయన .. అంత డబ్బు ‘ ఎలా ‘ సంపాదించావ్ తల్లీ !

Deepti Sunayana : యూట్యూబర్ దీప్తి సునయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీప్తి యూట్యూబ్ లో బాగా వీడియో సాంగ్స్ చేస్తూ మరింత పాపులారిటీని పెంచుకుంది. డాన్స్ వీడియోస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 2 లో చేసిన సంద‌డి అంతా ఇంత కాదు. క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ షో తో మ‌రింత పాపులారిటీని సంపాధించుకుంది. ఇక పలు సినిమాలో కూడా దీప్తి అలరించింది. మరో యూట్యూబర్ షణ్ముఖ్ తో ఐదేళ్లపాటు డేటింగ్ లో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది.

ఇటీవల ఏమోనో అని కవర్ సాంగ్ తో జనాలను ఆకట్టుకుంది. ప్రస్తుతం దీప్తి సునయన సోషల్ మీడియాలో వరుస ఫోటోలను పెడుతూ గ్లామర్ డోస్ ను పెంచేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దీప్తి అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల దీప్తి సునయన కొత్త ఇల్లు కొనుక్కుంది. ఈ క్రమంలోనే కొందరు అంత డబ్బు ఎలా సంపాదించావు అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీప్తి సునయన తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లతో ముచ్చటించింది.

ఈ క్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దీప్తి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. మీరు కొత్త ఇల్లు కొన్నారు కదా అంత డబ్బు మీకు ఎక్కడిది అని అడిగాడు. దానికి బదులుగా దీప్తి సునైనా యూట్యూబ్ ప్రారంభించినప్పటి నుంచి నేను సంపాదించుకున్న దాంట్లో 30% ఖర్చు పెట్టుకుని మిగతా 70% సేవ్ చేసుకునే దాన్ని. అలా దాచుకున్న డబ్బుతోనే ఇల్లు కొన్నాను అని చెప్పింది. ఇటీవల కొత్త ఇంట్లోకి కూడా షిఫ్ట్ అయినట్లు దీప్తి చెప్పుకొచ్చింది.

Must Read : K Viswanath : కె. విశ్వనాథ్ అంత్యక్రియలు ఇలా చేసారేంటి ! కారణం ఏమై ఉంటుంది ?