Drugs Case : డ్రగ్స్ కేసులో బయటపడుతున్న సిని సెలబ్రిటీలు…..దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పోలీస్ అధికారులు….

Drugs Case  : హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ కేసు పై విచారణ సాగిస్తున్న మాదాపూర్ పోలీసులు యమ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు సినీ రంగానికి చెందిన ఓ దర్శకుడుని, సిని రచయితను అరెస్ట్ చేశారు. డైరెక్టర్ మంతెన వాసు వర్మతో పాటు సినీ రచయిత పృథ్వి కృష్ణ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుండి 70 గ్రామ్స్ కొకైనా పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం […]

  • Published On:
Drugs Case : డ్రగ్స్ కేసులో బయటపడుతున్న సిని సెలబ్రిటీలు…..దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పోలీస్ అధికారులు….

Drugs Case  : హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ కేసు పై విచారణ సాగిస్తున్న మాదాపూర్ పోలీసులు యమ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు సినీ రంగానికి చెందిన ఓ దర్శకుడుని, సిని రచయితను అరెస్ట్ చేశారు. డైరెక్టర్ మంతెన వాసు వర్మతో పాటు సినీ రచయిత పృథ్వి కృష్ణ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుండి 70 గ్రామ్స్ కొకైనా పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ కేసులో నిర్మాత కె.వి చౌదరిని జూన్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే నెలలో మరొక డ్రగ్స్ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ప్లేస్ లో వర్మ పృథ్వి నిందితులు కాగా వర్మ “వాసు” అనే సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే అతను పరాయిలో ఉండడం మరియు అతను డైరెక్టర్ అని పెద్దగా ఎవరికి తెలియకపోవడంతో ఈ న్యూస్ వైరల్ కాలేదు. కానీ 20 రోజులు క్రితమే మాదాపూర్ పోలీసులు వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటుంది ! - నిర్మాత కె.పి.చౌద‌రి

రచయితగా స్క్రీన్ ప్లే రైటర్ గా డైరెక్టర్ గా పలు బాధ్యతలను నిర్వహించిన వాసు వర్మ దిల్ రాజ్ కాంపౌండ్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు.అందుకే దిల్ రాజు అతనికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ” జోష్ ” చిత్రానికి వాసు దర్శకత్వం వహించారు. అయితే ముంబైకి చెందిన రాహుల్ అశోక్ అనే వ్యక్తి వద్ద వీరిద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. అయితే ప్రస్తుతం సిని రంగానికి చెందిన వారు చాలామంది ఈ డ్రస్ కేసులో ఇరుక్కున్నారు. పలువురు నిర్మాతలు దర్శకులు నటీనటులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడం గమనార్హం.

Notices to Navadeep To Attend Interrogation In Drugs Case | cinejosh.com

మరోవైపు డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ సెకండ్ హీరో నవదీప్ ను నార్కోటెక్ అధికారులు తాజాగా విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు నావదీప్ ను విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనితో తనకు సంబంధం లేదంటూ మరో కొత్త విషయాన్ని బయట పెట్టాడు. ఇక నవదిప్ విచారణలో ఏం చెప్పాడు , అసలు ఏం అడిగారు, అసలు ఏం జరిగిందని వివరాల్లోకెళ్తే…సెప్టెంబర్ 14న తెలంగాణకు చెందిన నార్కోటెక్ అధికారులు గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరు కి చెందిన ముగ్గురు నైజీరియన్స్ ఒక దర్శకుడు తో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ కేస్: ఛార్మి కౌర్ అలియాస్ దాదా.. తెర వెనుక అసలు నిజాలు | unknown facts about charmy kaur drugs case, charmy, charmy kaur, tollywood drugs case, director puri jagannath, enforcement directory ...

ఇక ఈ ముఠా నుండి పలు రకాల డ్రక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక వారిని విచారించగా వారితో హీరో నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచంద్ర అనే వ్యక్తి నుండి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలియజేశారు. దీంతో తాజాగా పోలీసు అధికారులు నవదీప్ ను విచారించారు. ఈ క్రమంలోని దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బయటికి వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడుతూ రామచంద్ర అనే వ్యక్తితో నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే…కానీ అది 10 సంవత్సరాల క్రితం మాట. ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎక్కడ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో నేను ఓ పబ్ నిర్వహించిన కారణంగా నన్ను విచారించారు. ఇక అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అవసరమైతే మళ్లీ పిలుస్తామని తెలియజేసినట్లు నవదీప్ తెలిపాడు.