Breking News : వరుస విషాదాలతో టాలీవుడ్ .. కొన్ని నెలల్లోనే ఐదుగురు స్టార్స్ ని కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ..

Breking News : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమ నటనతో ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలేసిన ఐదుగురు స్టార్స్ ను తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది. దర్శకుడుగా, రచయితగా, నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 2 గురువారం నాడు మృతి చెందారు. శంకరాభరణం, స్వాతి ముత్యం, స్వయంకృషి ఆణిముత్యాలాంటి సినిమాలు తీసిన కె. విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఐదు జాతీయ అవార్డులను దక్కించుకున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స […]

  • Published On:
Breking News : వరుస విషాదాలతో టాలీవుడ్ .. కొన్ని నెలల్లోనే ఐదుగురు స్టార్స్ ని కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ..

Breking News : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమ నటనతో ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలేసిన ఐదుగురు స్టార్స్ ను తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది. దర్శకుడుగా, రచయితగా, నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 2 గురువారం నాడు మృతి చెందారు. శంకరాభరణం, స్వాతి ముత్యం, స్వయంకృషి ఆణిముత్యాలాంటి సినిమాలు తీసిన కె. విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఐదు జాతీయ అవార్డులను దక్కించుకున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఇక టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇటీవలే మరణించారు. టాలీవుడ్ లో 300కు పైగా సినిమాలు చేసిన కృష్ణ తెలుగు పరిశ్రమలో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే తన నటనతో, డైలాగులతో రెబల్ ట్యాగ్ ను తగిలించుకున్న కృష్ణంరాజు కూడా ఇటీవలే మృతి చెందారు. తన తరం హీరోలతో సమానంగా విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా జనాలను మెప్పించిన కైకాల సత్యనారాయణ కూడా ఇటీవలే తుది శ్వాస విడిచారు. మహానటుడు ఎస్వీరంగారావు నట వారసుడిగా తెలుగుతెరపై ఖ్యాతిగాంచిన నవరస నటనా సార్వభౌముడు సత్యనారాయణ మరణం టాలీవుడ్ ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెలుగు పరిశ్రమలో మరో సీనియర్ నటుడు చలపతిరావుని కూడా టాలీవుడ్ కోల్పోయింది. 1200కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నటుడు చలపతిరావు ఇటీవలే మరణించారు. అలాగే 16 ఏళ్ళ వయసులో పుట్టిల్లు సినిమాతో వెండితెరకు పరిచయమైంది జమున. మిస్సమ్మ సినిమాలు తన నటనతో సత్యభామ పాత్రలో జనాలను మెప్పించింది. ఆమె కూడా ఇటీవలే మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దర్శకుడు సాగర్ ఫిబ్రవరి 2వ తారీఖున మరణించారు.

Must Read : K Viswanath: శంకరాభరణం విడుదలైన రోజునే కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణించారు.