Deepika Padukone : తిరుమల తిరుపతిలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పడుకోణె…

Deepika Padukone  : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె తాజాగా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం డిసెంబర్ 14న రాత్రి కాలి బాట అలిపిరి మార్గం గుండా సామాన్య భక్తులతో పాటు గోవింద నామస్పరణ చేస్తూ దీపికా పడుకోణె స్వామివారి దర్శనానికి వెళ్లారు. దాదాపు మూడున్నర గంటల పాటు నడుచుకుంటూ తిరుమల కొండకి చేరుకున్నారు దీపికా పడుకోణె. అయితే స్టార్ సెలబ్రిటీ హోదాలో ఉండడంతో కాలిబాటన రావడంతో సామాన్య […]

  • Published On:
Deepika Padukone : తిరుమల తిరుపతిలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పడుకోణె…

Deepika Padukone  : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె తాజాగా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం డిసెంబర్ 14న రాత్రి కాలి బాట అలిపిరి మార్గం గుండా సామాన్య భక్తులతో పాటు గోవింద నామస్పరణ చేస్తూ దీపికా పడుకోణె స్వామివారి దర్శనానికి వెళ్లారు. దాదాపు మూడున్నర గంటల పాటు నడుచుకుంటూ తిరుమల కొండకి చేరుకున్నారు దీపికా పడుకోణె. అయితే స్టార్ సెలబ్రిటీ హోదాలో ఉండడంతో కాలిబాటన రావడంతో సామాన్య భక్తుల సైతం ఆమెను చూసి సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఇక కాలిబాట అనంతరం తిరుమల తిరుపతిలోని రాధేయం అతిథి గృహం చేరుకున్న దీపిక ఈరోజు శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో విఐపి విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపికా పడుకోణె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దీపిక తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ సరసన కల్కి సినిమాలో నటించినున్నారు. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరో రుతిక్ రోషన్ నటిస్తున్న ఫైటర్ సినిమాలో కూడా దీపిక కనిపించనున్నారు. ఇక ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అంతేకాక దీపిక తాజాగా ఓ హాలీవుడ్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే హీరోయిన్ గా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీీ కాస్త సమయాన్ని కేటాయించుకొని మరి తిరుపతి శ్రీవారి దర్శనానికి రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారా అభిమానులు.