Pallavi Prashanth : ఈరోజు నుండి నేను రైతు బిడ్డని కాదు…
Pallavi Prashanth : జైలు ఎంతటి వారిలో అయినా మార్పు తీసుకువస్తుంది.బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ఆ సంతోషాన్ని అనుభవించేలోపే కటకటాల పాలయ్యారు. బెయిల్ పై ఇటీవలే బయటకు వచ్చాడు. జైలు కి వెళ్లి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ లో చాలా మార్పు వచ్చిందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు భూమి పుత్రుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ ఇకపై వేరే పేరుతో కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ 7వ సీజన్ గెలిచిన […]
Pallavi Prashanth : జైలు ఎంతటి వారిలో అయినా మార్పు తీసుకువస్తుంది.బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ఆ సంతోషాన్ని అనుభవించేలోపే కటకటాల పాలయ్యారు. బెయిల్ పై ఇటీవలే బయటకు వచ్చాడు. జైలు కి వెళ్లి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ లో చాలా మార్పు వచ్చిందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు భూమి పుత్రుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ ఇకపై వేరే పేరుతో కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ 7వ సీజన్ గెలిచిన తర్వాత 48 గంటలు గడచిన వెంటనే జైలుకు వెళ్లి వచ్చిన ప్రశాంత్ కు ప్రశాంతత కరువైంది. గెలిచిన సంతోషాన్ని అందరితో పంచుకునే లోపే జైలుకెళ్ళి రావాల్సి వచ్చింది. దీనితో ప్రశాంత్ కుటుంబం కూడా తీవ్ర ఇబ్బంది గురి అయ్యింది అని చెప్పాలి .
అయితే బిగ్ బాస్ ఫైనల్ రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన ఘటనల వలన ప్రశాంత్ ను ఏ 1 ముద్దాయిగా అతని సోదరుడు మనోహర్ నీ ఏ 2 ముద్దాయిగా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించింది. ఇక ఈ కేసులో అతనికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 23 న చంచల్ గూడ జైలు నుండి ఆయన విడుదల అయ్యారు. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ తన ఇంస్టాగ్రామ్ లో పేరు మార్చుకున్నారు. మల్ల వచ్చిన స్పై టీమ్ విన్నర్ ని కొత్తగా తన ఇంస్టాగ్రామ్ లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతను తన సోదరుడు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
తన విజయంలో స్పై బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని పల్లవి ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ కు అండగా బోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్ లో కూడా ప్రశాంత్ కు చాలా సపోర్ట్ చేశారు. ప్రశాంత్ కోసమే బిగ్ బాస్ కు వచ్చానని బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ రైతుబిడ్డకు న్యాయం జరిగిందని అభినందనలు తెలిపాడు.15 వేల జరిమానా తో పాటు రెండు షూరిటీ పత్రాలతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిలు వచ్చేలా చేసిన అడ్వకేట్ లకి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా పక్షపాతం లేకుండా తీర్పు ఇచ్చిన జడ్జి గారికి పాదాభివందనం తెలిపాడు.