Bhagavanth Kesari Review : భగవంతు కేసరి రివ్యూ….

Bhagavanth Kesari Review  :  ఇటీవల దసరా కానుకగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 విడుదల అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దసరా కానుకగా ఈరోజు విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు ప్రివ్యూ లు పడ్డాయి. దీంతో సినిమా విడుదల కాకముందే బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ రివ్యూ లు వచ్చాయి. ఇదే క్రమంలో సినీ […]

  • Published On:
Bhagavanth Kesari Review : భగవంతు కేసరి రివ్యూ….

Bhagavanth Kesari Review  :  ఇటీవల దసరా కానుకగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 విడుదల అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దసరా కానుకగా ఈరోజు విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు ప్రివ్యూ లు పడ్డాయి. దీంతో సినిమా విడుదల కాకముందే బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ రివ్యూ లు వచ్చాయి. ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం ప్రత్యేక షో కూడా వేశారట . ఇక ఈ షో చూసిన తర్వాత సినీ ప్రముఖులు సైతం ఇది మామూలు సినిమా కాదంటూ బాలయ్యను తెగ పొగిడేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ట్రేండింగ్ హీరోయిన్ గా ఉన్న శ్రీ లీల ఈ సినిమాలో నటించడంతో సినిమాకు మరికాస్త హైప్ పెరిగిందని చెప్పాలి. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ అన్ని అంచనాలకు మించి ఉండగా సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి.

 సినిమా కథ విషయానికొస్తే….

bhagwantu-kesari-review

తెలంగాణకు చెందిన భగవంతు కేసరి బాలకృష్ణ నేలకొండపల్లి అనే గిరిజన ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఆయన చాలా మొండివాడు..తన వాళ్లకి ఏదైనా అపాయం వచ్చిందంటే అసలు తట్టుకోలేడు. తన సొంతం అనుకున్న వారికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అయితే భగవత్ కేసరికి ఆర్మీ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తన కూతురిని ఆర్మీకి పంపించాలని ,భగవంతు కేసరి కలలు కంటూ ఉంటాడు. కానీ తన కూతురు విజ్జి పాప ( శ్రీ లీల) కు ఆర్మీకి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. ఇదే క్రమంలో విజ్జి పాప కోసం కొందరు రౌడీలు మరియు రాజకీయ నాయకులతో భగవంత్ కేసరి గొడవపడతాడు. అయితే రాజకీయ నాయకులకు రౌడీలకు మరియు తన కూతురికి మధ్య ఏంటి సంబంధం…? భగవంత్ కేసరి కూతురు ఆర్మీకి వెళ్తుందా ..? రౌడీల భారీ నుండి తన కూతుర్ని భగవంత్ కేసరి కాపాడుకుంటాడా ..? ఇక తన భార్యగా నటించిన కాజల్ అగర్వాల్ ఎవరు ..?ఆమెకి కేసరికి పరిచయం ఎలా ఏర్పడింది…?అనే విషయాలపై సినిమా నడుస్తుంది. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

మూవీ రివ్యూ…

bhagwantu-kesari-review

ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన సినిమాలలో ది బెస్ట్ సినిమా ఇది అని చెప్పవచ్చు . దర్శకుడు అనిల్ రావిపుడి బాలయ్యను సరికొత్తగా చూపించాడు. అయితే అనిల్ రావిపూడి ఇప్పటివరకు కామెడీ సినిమాలు మాత్రమే చేశాడు కానీ ఇప్పుడు ఎమోషనల్, డ్రామా ,యాక్షన్ , లవ్ అన్ని కలిపి మిక్స్ చేసి ఈ సినిమాను తెరపై తీసుకొచ్చారు. ఇక బాలయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించేశాడు. బాలయ్య బాబు యాక్టింగ్ వేరే లెవల్లో ఉంటుంది. ఈ వయసులో కూడా బాలయ్య ఉత్సాహం ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక బాలయ్య కూతురుగా నటించిన శ్రీలీల కూడా ఇరగదీసింది. తాను చేసిన పాత్ర అందరూ గుర్తుంచుకునేలా నటించింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రీకూతుళ్ళ మధ్య అనుబంధాన్ని వాత్సల్యాన్ని చక్కగా చూపించాడు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ గురించి మాట్లాడితే థియేటర్లో బాంబులు పేలుతాయి అని చెప్పాలి. ఒక్కొక్క డైలాగ్ ఒక్కో డైమండ్ లా ఉంటుంది. బాలయ్య బాబు అంటేనే ఎలివేషన్స్ భారీ డైలాగ్స్ కు మారుపేరు.అంతేకాక తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడిన బాలయ్య డైలాగ్స్ తో ఇరగదీసేసారు. ఇక బాలయ్య భార్యగా కాజల్ అగర్వాల్ పాత్ర కొద్దిసేపు ఉన్నప్పటికీ ఆమె కూడా అదరగొట్టింది. ఓవరాల్ గా సినిమా అయితే పాజిటివ్ టాక్ తో సాగుతుంది.