Nandamuri Balakrishna : నేటితరం హీరోలకు నిద్రలేకుండా చేస్తున్న బాలయ్య…సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంతటి క్రేజ్ ఏంటయ్యా…

Nandamuri Balakrishna  : నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా ఒకదాని తర్వాత మరొకటి సూపర్ హిట్ సినిమాలను చేస్తూ దూసుకొస్తున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాతో ఇండస్ట్రీ సూపర్ హిట్ అందుకున్న బాలయ్య ఇటీవల సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమాతో ముందుకు వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమా ఫలితాలు చూసిన బాలయ్య మాస్ మూవీస్ కి క్రేజ్ ఎప్పటికీ తగ్గదని ప్రూవ్ అయింది. ఈ రెండు సినిమాల […]

  • Published On:
Nandamuri Balakrishna : నేటితరం హీరోలకు నిద్రలేకుండా చేస్తున్న బాలయ్య…సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంతటి క్రేజ్ ఏంటయ్యా…

Nandamuri Balakrishna  : నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా ఒకదాని తర్వాత మరొకటి సూపర్ హిట్ సినిమాలను చేస్తూ దూసుకొస్తున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాతో ఇండస్ట్రీ సూపర్ హిట్ అందుకున్న బాలయ్య ఇటీవల సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమాతో ముందుకు వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమా ఫలితాలు చూసిన బాలయ్య మాస్ మూవీస్ కి క్రేజ్ ఎప్పటికీ తగ్గదని ప్రూవ్ అయింది. ఈ రెండు సినిమాల ఊపు తో ఉన్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాను చేస్తున్నాడు.

balayya-who-is-giving-sleepless-nights-to-todays-heroes-balayya-craze-in-the-second-innings-too

 

ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ సినిమా టీజర్ పై భారీ అంచనాలు పెరిగాయి. భగవంతు కేసరి సినిమా మునుపటి బాలకృష్ణ సినిమాల లాగా కాకుండా సరి కొత్తగా ఉండేలా కనిపిస్తుంది. బాలయ్య లుక్ సంథింగ్ స్పెషల్ గా ఉన్న ఈ భగవంత్ కేసరి సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి కాకుండానే బాలయ్య తన 109వ సినిమాను కూడా మొదలెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక అనౌన్స్ మెంట్ కూడా చేశాడు బాలయ్య.బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్రీ పోస్టర్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళుతుందని సమాచారం.

balayya-who-is-giving-sleepless-nights-to-todays-heroes-balayya-craze-in-the-second-innings-too

ఇలా నందమూరి బాలాయ్య ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమా చేస్తూ నేటి తరం హీరోలకు ఈక్వల్ గా పోటీ ఇస్తున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా హిట్స్ పై హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నారు. టీజర్ తోనే రచ్చ లేపిన భగవంతు కేసరి సినిమా బాలయ్య కెరియర్ లో మరో సూపర్ హిట్ గా నిలవడం ఖాయం అనిపిస్తుంది. బాలయ్య దూకుడు చూస్తుంటే నేటితరం హీరోలు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. దసరా నాది సంక్రాంతి నాది అంటున్న బాలకృష్ణ రాబోయే తన రెండు సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి మరి.