Viral news : బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే ఎంత పని చేసారో చూడండి…ఫోటోలను షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న యజమాని..

Viral news : బ్యాచిలర్స్ నివసించే గదులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అపరిశుభ్రతతో , ఇంటినిండా చెత్తచెదారం , చిందరవందరగా పడేసి ఉన్న వస్తువులతో ఉంటుంది. దీనికి తోడు మరి కొంతమంది యువకులు చేసే అల్లరికిి ఇంటి చుట్టుపక్కల వారు కూడా ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ కారణం చేతనే పట్టణాలు ,నగరాలలో బ్యాచులర్స్ కు ఎవరు రూమ్స్ ఇవ్వడం లేదు. బ్యాచిలర్స్ కి ఇది పెద్ద సమస్యగా మారింది. టూలెట్ బోర్డులు కనిపించినప్పటికీ అందులో చాలా […]

  • Published On:
Viral news : బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే ఎంత పని చేసారో చూడండి…ఫోటోలను షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న యజమాని..

Viral news : బ్యాచిలర్స్ నివసించే గదులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అపరిశుభ్రతతో , ఇంటినిండా చెత్తచెదారం , చిందరవందరగా పడేసి ఉన్న వస్తువులతో ఉంటుంది. దీనికి తోడు మరి కొంతమంది యువకులు చేసే అల్లరికిి ఇంటి చుట్టుపక్కల వారు కూడా ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ కారణం చేతనే పట్టణాలు ,నగరాలలో బ్యాచులర్స్ కు ఎవరు రూమ్స్ ఇవ్వడం లేదు. బ్యాచిలర్స్ కి ఇది పెద్ద సమస్యగా మారింది. టూలెట్ బోర్డులు కనిపించినప్పటికీ అందులో చాలా వరకు ఫ్యామిలీ అని రాసి ఉంటుంది. కొన్నిసార్లు అయితే కాళ్ళు అరిగేలా తిరిగిన ఫలితం దక్కదు. ఒకవేళ దొరికిన యజమానులు కండిషన్స్ పెడతారు.

bachelors-rented-home-photos-viral

అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే బెంగళూరుకు చెందిన ఓ యజమాని బ్యాచిలర్స్ కు ఇల్లు అద్దెకిస్తే విచిత్రమైన అనుభవం ఎదురయింది. చదువుకున్నవారు కదా అని బ్యాచిలర్స్ కి ఇస్తే ఎలా చేశారో చూడండి అంటూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ వైరల్ అవుతుంది. అయితే బెంగళూరుకు చెందిన ఓ అపార్ట్మెంట్ యజమాని చదువుకున్న బ్యాచిలర్స్ కు రెండు బెడ్ రూమ్స్ ను అద్దె అని ఇచ్చాడు. నెలకు 17000 అద్దెతో సెక్యూరిటీ డిపాజిట్ కింద 85000 తీసుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు కానీ ఆ తర్వాత అసలైన సమస్య మొదలైంది. నాలుగు నెలల తర్వాత వారు ఉన్నటువంటి ఇంటిని కాళీ చేసి వెళ్లిపోయారు. యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పారు.

వారు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత యజమాని ఇంట్లో వెళ్లి చూడగా షాక్ అయ్యాడు. ఇంటి నిండా బీరు బాటిల్లు చెత్తాచెదారం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక వాటిని ఫోటోలు వీడియోలు తీసి శుభ్రంగా ఉన్న తన ఇంటిని పాడుబడిన బంగ్లాలా మార్చారు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసినవారు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో ఇంటి యజమానులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని, వేలకువేలు తీసుకోవడంతో పాటు 6 నుండి 10 నెలల అడ్వాన్స్ అడుగుతున్నారని నేటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా నగరాల్లో ఇలాంటిది లేదని బెంగళూరులో మాత్రమే ఇలా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు యజమానికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.