Ariyana Glory : ఆంటీ అని కామెంట్ చేసిన వారి నోరు మూయించిన అరియానా….

Ariyana Glory  : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్జీవి ఇంటర్వ్యూల ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే మొదట చాలా సన్నగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫోటోలలో కాస్త పొద్దుగా కనిపించడంతో చాలామంది ఆంటీ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే […]

  • Published On:
Ariyana Glory  : ఆంటీ అని కామెంట్ చేసిన వారి నోరు మూయించిన అరియానా….

Ariyana Glory  : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్జీవి ఇంటర్వ్యూల ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే మొదట చాలా సన్నగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫోటోలలో కాస్త పొద్దుగా కనిపించడంతో చాలామంది ఆంటీ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆంటీ అని కామెంట్ చేసిన వారిపై స్పందించిన అరియానా వారి నోరులు మూయించెలా ఒక వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ariyana-glory-video-viral
ఇక ఈ వీడియోలో అరియానా మాట్లాడుతూ సన్నగా ఉన్నప్పుడేమో చాలా సన్నగా ఉన్నావు ఏంటి నువ్వు అన్నారు…లావు అయితేనేమో ఏంటి అంతలావు ఉన్నావు ఆంటీ లాగా ఉన్నావు అంటున్నారు. అసలు నువ్వు ఎలా ఉంటావు. నాలాగా నువ్వు కూడా ఒక పోస్ట్ పెట్టవచ్చు కదా. నేను కూడా నిన్ను చూస్తాను కదా. లేదా నన్ను చూడడం మీకు ఇబ్బంది అనిపిస్తే అన్ ఫాలో చేయొచ్చు కదా. నువ్వు ఎంత వేస్ట్ ఫెలో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నేను లావు అయితే మీకేంటి సన్నగా అయితే మీకేంటి. అట్లీస్ట్ నేను నా లైఫ్ లో ప్రోగ్రెస్ అవుతున్నాను. నువ్వేం చేస్తున్నావ్ రా. కామెంట్స్ చేస్తున్నావు. వెళ్లి పని చూసుకో అని గట్టిగా ఇచ్చి పడేసింది.

ariyana-glory-video-viral

ఆమె విడుదల చేసిన వీడియోతో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టాలంటే కాస్త భయపడాల్సిందే. ఇదిలా ఉండగా సరైన కంటెంట్ ఉన్న ప్రాజెక్టులను అరియానా ఒప్పుకుంటే ఇండస్ట్రీలో తనకు తిరిగే లేదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తన అందాలను ఆరబోస్తూ అరియానా హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అరియానా తన కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని, వివాదాస్పద పోస్టులకు ఆమె దూరంగా ఉండటం మంచిది అంటూ అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే ఆమె రేంజ్ మరింత పెరుగుతుందంటూ చెప్పుకొస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by starmaa__shows (@starmaa__shows)