Multistarrer Movie : చరణ్ తారక్ కాంబినేషన్లో మరో సినిమా ……దర్శకుడు ఎవరంటే…

Multistarrer Movie : ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు కారణంగా ఇంతకు ముందుల హీరోల అభిమానులు ఎలాంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా కలిసి ఉంటున్నారు. పొలంలో కలుపు మొక్కల అక్కడక్కడ కొంతమంది ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం హీరోలందర్నీ ఆదరిస్తున్నారు. ఇక దీనికి ఆర్ఆర్ఆర్ సినిమా బాగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన తారక్ మరియు చరణ్ ఇద్దరు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు. ఇక ఈ సినిమాలో వీరిద్దరూ […]

  • Published On:
Multistarrer  Movie : చరణ్ తారక్ కాంబినేషన్లో మరో సినిమా ……దర్శకుడు ఎవరంటే…

Multistarrer Movie : ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు కారణంగా ఇంతకు ముందుల హీరోల అభిమానులు ఎలాంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా కలిసి ఉంటున్నారు. పొలంలో కలుపు మొక్కల అక్కడక్కడ కొంతమంది ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం హీరోలందర్నీ ఆదరిస్తున్నారు. ఇక దీనికి ఆర్ఆర్ఆర్ సినిమా బాగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన తారక్ మరియు చరణ్ ఇద్దరు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు. ఇక ఈ సినిమాలో వీరిద్దరూ సొంత అన్నదమ్ముల కలిసిపోయి నటించారు. దీంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని బాగా ఆకర్షించింది. దీంతో మెగా మరియు నందమూరి అభిమానులు వేరు వేరు అన్న ఫీలింగ్ చేరిగిపోయింది.

another-movie-in-charan-tarak-combination-who-is-the-director

అయితే ఇదంతా రాజమౌళి చలవ అనే చెప్పాలి. అసలు ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయాలన్న ఆలోచనతోపాటు ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాను రూపొందించడం వర్ణాతీతం. అయితే ఇప్పుడు మరోసారి చరణ్ మరియు తారక్ కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ రాబోతుందని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. ఇటీవల ఓ ప్రముఖ చానల్ తో మాట్లాడినన ఆయన పాన్ ఇండియా హీరోలతో మరో సినిమా ఉంటుందని ప్రస్తావించారు.  హాలీవుడ్ స్టాండర్స్ తో ఈ సినిమా ఉంటుందని అంతేకాక ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ గా వస్తుందని చెప్పుకొచ్చారు.

another-movie-in-charan-tarak-combination-who-is-the-director

అయితే ఈ సినిమాకు దర్శకుడిగా రాజమౌళి ఉండకపోవచ్చు కానీ అతని పర్యవేక్షణలోనే ఈ సినిమా జరుగుతుందని తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నా విషయంపై చర్చ మొదలైంది. ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేస్తారా..? లేక రాజమౌళి కొడుకు చేస్తారా..?లేక మరెవరైనా వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమా గురించి కూడా విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా అనంతరం మహాభారతం ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు.