Anasuya Bharadwaj : అలాంటివారు ఆంటీ అన్న ఓకే…అనసూయ సంచలన వ్యాఖ్యలు…
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు కాబోలు. బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించి ఈ మధ్యకాలంలో విపరీతంగా వెండితెరపై అవకాశాలను దక్కించుకుని దూసుకెళ్తోంది. విభిన్నమైన పాత్రలో నటిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించింది. మరి ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ మంచి మార్కులు పడ్డాయి. దీంతో అప్పటినుండి అనసూయను కాస్త […]
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు కాబోలు. బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించి ఈ మధ్యకాలంలో విపరీతంగా వెండితెరపై అవకాశాలను దక్కించుకుని దూసుకెళ్తోంది. విభిన్నమైన పాత్రలో నటిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించింది. మరి ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ మంచి మార్కులు పడ్డాయి. దీంతో అప్పటినుండి అనసూయను కాస్త రంగమ్మత్తగా కూడా పిలుస్తున్నారు. ఇక అప్పటినుండి ఈ ముద్దుగుమ్మకు సినీ అవకాశాలు క్యూ కట్టాయి. అయితే అనసూయ మాత్రం సినిమా ఎంచుకోటంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కేవలం డబ్బు కోసం కాకుండా మంచి గుర్తింపుని ఇచ్చే పాత్రలను ఎంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దర్శకులు కూడా అనసూయ కోసం ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసి మరి తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇటీవల విడుదలైన పెదకాపు చిత్రంలో నటించిన అనసూయ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లో కూడా కనిపించనుంది.
అయితే కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా అనసూయ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఖాళీ సమయం దొరికిన వెంటనే సోషల్ మీడియా ఖాతాలో తన ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే ఆమె పెట్టే పోస్టులు చాలామంది ట్రోల్స్ చేస్తుంటారు. దీనిలో భాగంగానే ముఖ్యంగా ఆంటీ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఆమెను ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆంటీ అనే పదం వింటే తనకు ఎందుకు నచ్చదు అనే విషయాలను తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిలో భాగంగా అనసూయ మాట్లాడుతూ…నేను ఏదైనా అంశంపై స్పందిస్తే…” ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఆంటీ ” మీకెందుకు ఇవన్నీ అంటూ కామెంట్స్ చేస్తారు. నిజానికి ఆంటీ అనే పదం అసలు తప్పు కాదు. కానీ దానిని వల్గర్ గా ఉపయోగిస్తున్నారు.
చిన్నపిల్లలు ఆంటీ అని చాలా ముద్దుగా పిలుస్తారు. నా పిల్లల ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఆంటీ అనే పిలుస్తారు. వాళ్లు అలా పిలిచినా నాకు ఇష్టమే. కానీ నాకంటే పెద్దవాళ్ళు తెలియని వాళ్లు కూడా ఆంటీ అని మరో అర్థం వచ్చేలా పిలుస్తున్నారు . అందుకే నాకు ఆ పదం నచ్చటం లేదు. అసలు ఆంటీ అంటే పిన్ని. అమ్మ తర్వాత అమ్మా అని అర్థం. చిన్నప్పటినుండి ఈ విషయాన్ని చెప్తూనే మనల్ని పెంచారు . నేను కూడా చిన్నప్పుడు చాలామందిని ఆంటీ అని పిలిచాను. అలాగే మా ఇంటి పక్కన వారిని కూడా ఆంటీ అనే అనే పిలుస్తాను. ఆంటీ అని పిలిస్తే వాళ్లు అర్ట్ అవుతారని చెబితే నేను వారిని అలా పిలవను. అది నేను అర్థం చేసుకోగలను. అలాగే నాకు కూడా ఆంటీ అని పిలిపించుకోడం ఇష్టం లేదు అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు అలా అనాలి.. ఇలా పిలిచే వాళ్లంతా పైసాచిక ఆనందం పొందుతున్నారు. అసలు జన్మలో మనం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటామో లేదో తెలియదు. ఇలా ఫేస్ టు ఫేస్ పరిచయం లేని వ్యక్తి నన్ను ఇలా అంటుంటే వారి చుట్టూ ఉన్న మహిళలను ఇంకెలా చూస్తారు..?అలాంటి వారి భవిష్యత్తులో రేపిస్టుగా మారతారు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.
View this post on Instagram