Vijay Deverakonda – Anasuya : విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తున్న అనసూయ…అసలు వీరిద్దరి మధ్య గొడవ ఏంటంటే…

Vijay Deverakonda – Anasuya  : బుల్లితెర పై టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అనసూయ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.అయితే అనసూయ అప్పుడప్పుడు తనకు అస్సలు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూర్చి వివాదాలను సృష్టిస్తుంది. ఇప్పుడు ఇలాంటిదే ఒక పని చేసి ఒకే ఒక్క ట్విట్ తో మళ్ళీ ట్రెండింగ్ లోకి […]

  • Published On:
Vijay Deverakonda – Anasuya : విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తున్న అనసూయ…అసలు వీరిద్దరి మధ్య గొడవ ఏంటంటే…

Vijay Deverakonda – Anasuya  : బుల్లితెర పై టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అనసూయ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.అయితే అనసూయ అప్పుడప్పుడు తనకు అస్సలు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూర్చి వివాదాలను సృష్టిస్తుంది. ఇప్పుడు ఇలాంటిదే ఒక పని చేసి ఒకే ఒక్క ట్విట్ తో మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు అనసూయ భరద్వాజ్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి మూవీ పోస్టర్ రిలీజ్ అయింది … దానికి అనసూయ ఇప్పుడే ఓ పోస్ట్ చూసానని “ది” నా.. బాబోయ్ పైత్యం… ఏం చేస్తాం…అంటకుండా చూసుకుందాం అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీనిలో ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే అసలైన మేటర్ ఉంది.

anasuya-is-targeting-vijay-devarakonda-the-real-fight-between-the-two-is

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు “ది” అనే పదాన్ని పెట్టారు. దానిని హైలెట్ చేస్తూ అనసూయ ట్వీట్ ను చేసినట్లు అర్థమవుతుంది. దీంతో విజయ ఫ్యాన్స్ ఆమెకు గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. వారికి అనసూయ కూడా కౌంటర్ ఇస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే హరిశంకర్ లాంటి దర్శకులు సైతం విజయ్ బర్త్ డే సందర్భంగా ది విజయ్ దేవరకొండ అనే సంబోధించారు. మరి అనసూయ మాత్రం ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది. దానికి పెద్ద కారణమే ఉందట . అర్జున్ రెడ్డి సినిమా టైంలోనే అనసూయకు మరియు విజయకు మధ్య గొడవ మొదలైంది.

anasuya-is-targeting-vijay-devarakonda-the-real-fight-between-the-two-is

అయితే మొదలుపెట్టింది మాత్రం అనసూయ అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి మూవీ ఫ్రీ రిలీజ్ టైం లో విజయ్ స్టేజ్ పై మాట్లాడినన మాటలు అనసూయ కు నచ్చకపోవడంతో విమర్శించడం మొదలెట్టింది. అప్పటినుండి ఎప్పుడు ఛాన్స్ దొరికిన విజయ్ పై సెటైర్లు వేస్తూ వస్తుంది. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించిన మీకు మాత్రమే చెప్తా అనే సినిమా లో అనసూయ కూడా నటించింది .ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు సర్దుమనిగాయనుకున్నారు కానీ… ఇంకా లేదని ఈ తాజా ట్విట్ తో అర్థమవుతుంది. విజయ్ ఫ్యాన్స్ తమ హీరోని టోల్ చేస్తే మాత్రం… మరోసారి ఆంటీ అనే పదాన్ని ట్రెండింగ్లోకి తీసుకొస్తామంటున్నారు. మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాలి…