Baby : బేబీ సినిమాపై కేసు నమోదు…ఎందుకంటే…

Baby : బేబీ మూవీ ఒక సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. యూత్ మొత్తం బేబీ మూవీ కి చాలా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ మూవీలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. అలాగే హీరోయిన్ గా యూట్యూబ్ స్టార్ వైష్ణవి నటించారు. అలాగే బేబీ మూవీలోని వైష్ణవి పాత్రకు కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద […]

  • Published On:
Baby : బేబీ సినిమాపై కేసు నమోదు…ఎందుకంటే…

Baby : బేబీ మూవీ ఒక సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. యూత్ మొత్తం బేబీ మూవీ కి చాలా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ మూవీలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. అలాగే హీరోయిన్ గా యూట్యూబ్ స్టార్ వైష్ణవి నటించారు. అలాగే బేబీ మూవీలోని వైష్ణవి పాత్రకు కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అందరికి తెలిసిన విషయమే. చిన్న సినిమాగా వచ్చిన బేబీ సినిమా మంచి విజయంతో పాటు కలెక్షన్ కూడా బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా జులై 2023లో విడుదలై అందరి చేత శభాష్ అనిపించుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో యూత్ నీ ఎంతగానో అలరించింది.

సినిమా , కథ , అంశం , దాని తీసిన చేసిన విధానంపై అభిప్రాయాలు వచ్చిన సినిమా పెద్ద హిట్ అయింది. అయితే తాజాగా ఈ బేబీ చిత్ర బృందం పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయింది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ బేబీ సినిమా తనదే అంటూ ఒకరు ముందుకి వచ్చారు.అంతే కాదు షార్ట్ ఫిలిం డైరెక్టర్ చరణ్ సాయి శ్రీ రామ్ కాఫీ కొట్టి బేబీ సినిమాగా తేరకు ఎక్కించారని హైదరాబాదులోని రాయదుర్గం స్టేషన్ లో మూవీ దర్శక నిర్మాత పై ఫిర్యాదు చేశాడు. ఇక మీడియాతో మాట్లాడిన ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్ తను గతంలో ” కన్నా ప్లీజ్ ” అనే కథను సాయి రాజేష్ కి వినిపించారని ఇక అదే కథను ప్రేమించవద్దు అనే షార్ట్ ఫిలిం తీశానని చెప్పారు. ఇక కథ తో తన అనుమతి లేకుండా సాయి రాజేష్ ఎస్ కే ఎన్ బేబీ సినిమాను తెరక్కించారని ఆరోపించారు. మరి ఈ ఆరోపణలపై బేబీ చిత్రం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.