Mrunal Thakur : త్వరలోనే పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur  : సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అయితే బాలీవుడ్ నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తొలి సినిమాకే ఘన విజయం సాధించింది. అయితే మొదట హిందీ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్ గా మారింది. అయితే తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా నటించి వెండితెరపైకి […]

  • Published On:
Mrunal Thakur : త్వరలోనే పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur  : సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అయితే బాలీవుడ్ నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తొలి సినిమాకే ఘన విజయం సాధించింది. అయితే మొదట హిందీ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్ గా మారింది. అయితే తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా నటించి వెండితెరపైకి అడుగు పెట్టింది. అయితే అక్కడ కూడా ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించి తొలి సినిమాలోతో సూపర్ హిట్ అందుకుంది.

Mrunal Thakur gave clarity about her marriage...

ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో అమ్మడు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “హాయ్ నాన్న” సినిమా తో మృణాలు ఠాకూర్ నటించింది. ఇక ఈ సినిమా నిన్నటి రోజున అంటే డిసెంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ సినిమా కూడా ప్రేక్షకులలో మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మెృణాల్ కు వరుసగా ఇట్స్ పడుతూ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కూడా మృణాల ఠాకూర్ నటించనుంది. ఇదిలా ఉంటే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మృణాల్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది.

Mrunal Thakur gave clarity about her marriage...

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం మృణాల్ న్యూ జెర్సీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం మృణాల్ న్యూ జెర్సీ వెళ్ళినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా అక్కడే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… హాయ్ నాన్న సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనదని..అలాగే ఈ సినిమాలో సమయమా మరియు అమ్మడి అనే సాంగ్స్ నాకు చాలా ఇష్టం అని తెలియజేసింది. సీతారామం సినిమా నుంచి ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఓ పిల్లోడు ఆమెను మీకు పెళ్లి అయిందా అని ప్రశ్నించగా దానికి మృణాల్ నవ్వుతూ త్వరలోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం మృణాలు పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. వరుడు ఎవరు అనే విషయంపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)