Anasuya Bharadwaj : సంక్రాంతి పండుగ వేల మెరిసిన అనసూయ…

Anasuya Bharadwaj : పండుగ సందర్భంగా చేసే పోస్ట్ అయినా సోషల్ మీడియాలో సాధారణంగా చేసే పోస్ట్ అయినా సరే అనసూయ చర్యలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. ఇక సోషల్ మీడియా వేదికగా తనను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి ఫైర్ బ్రాండ్ లా కౌంటర్లు వేసే అనసూయ తనను అభిమానించే వారికి మాత్రం అందాల రాశిలానే కనిపిస్తుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో […]

  • Published On:
Anasuya Bharadwaj : సంక్రాంతి పండుగ వేల మెరిసిన అనసూయ…

Anasuya Bharadwaj : పండుగ సందర్భంగా చేసే పోస్ట్ అయినా సోషల్ మీడియాలో సాధారణంగా చేసే పోస్ట్ అయినా సరే అనసూయ చర్యలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. ఇక సోషల్ మీడియా వేదికగా తనను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి ఫైర్ బ్రాండ్ లా కౌంటర్లు వేసే అనసూయ తనను అభిమానించే వారికి మాత్రం అందాల రాశిలానే కనిపిస్తుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను పెడుతూ కుర్రకారులను హీటెక్కిస్తోంది. ఎవరు ఏమైనా అనుకోండి… ఐ డోంట్ కేర్ అంటూ నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్లు బతుకుతా అంటూ తనను ట్రోల్ చేసే వారికి క్లాసు ఇచ్చే అనసూయ ఎలాంటి పోస్ట్ పెట్టడానికైనా అస్సలు భయపడదు.

Anasuya-2.jpg

అయితే చాలామంది ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే బాగోదేమో అని భయపడుతుంటారు కానీ అనసూయ మాత్రం అవేమీ పట్టించుకోకుండా షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే అనసూయ తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ మూడు భాషలలో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది. అదేవిధంగా తన ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేసి పద్ధతిగా చీర కట్టులో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది.

Image

ఇక సంక్రాంతి పండుగ అంటే చాలామంది పిండి వంటలు వండుతున్నట్లుగా ఫోటోలు దిగుతారు. కానీ అనసూయ చీర కట్టులో ఆరుబయట వేసిన ముగ్గు దగ్గర ఫోటోలు దిగింది. తన భర్తతో మరియు పిల్లలతో పాటు దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో అనసూయ మాత్రం చీరకట్టులో మతి పోగొడుతుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ ఉన్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నేటిజనులు అనసూయాకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే మరికొందరు ఎప్పటిలాగానే నెగిటివ్ కామెంట్స్ చేస్తూన్నారు.