Ananya Nagala : అవకాశాల కోసమే ఆ పని చేస్తున్న…తప్పేంటి…అనన్య నాగళ్ళ…
Ananya Nagala : తెలుగింటి అమ్మాయి ఖమ్మం జిల్లా ఆడపడుచు అనన్య నాగల్ల అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ మల్లేశం సినిమా హీరోయిన్ అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత శాకుంతలం సినిమాలో కూడా కనిపించడం జరిగింది. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరి సినిమాలపై ఉన్న […]
Ananya Nagala : తెలుగింటి అమ్మాయి ఖమ్మం జిల్లా ఆడపడుచు అనన్య నాగల్ల అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ మల్లేశం సినిమా హీరోయిన్ అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత శాకుంతలం సినిమాలో కూడా కనిపించడం జరిగింది. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరి సినిమాలపై ఉన్న ఇష్టంతో వచ్చిన అనన్య వరుసగా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ ధరను దాట్ల , సిమ్రాన్ గుప్తా ,అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తేరకెక్కిన సినిమా అన్వేషి.
అరుణ శ్రీ వెంకటరమణ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వీ జే కన్న దర్శకత్వం వహిస్తున్నారు. టీ గణపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్న అనన్య తన సినీ కెరియర్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేసింది. అయితే వకీల్ సాబ్ సినిమా ముందు వరకు సోషల్ మీడియాలో ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేసె ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎందుకు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తుందనే విషయాలను తెలియజేసింది.
అయితే పవన్ కళ్యాణ్ హీరోగా తేరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ముందు వరకు కూడా అనన్య ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు ఎక్కువగా పంచుకునేది. అయితే శాకుంతలం సినిమా టైంలో కొన్ని గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నప్పుడు నేటిజన్స్ నుంచి వాటికి బాగా రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి సినిమా రంగంలో దూసుకెళ్లాలంటే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలనుకున్న అనన్య అప్పటినుండి గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ వస్తున్నట్లుగా తెలియజేశారు. సినిమా అవకాశాల కోసమే తాను ఈ విధంగా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.