Allu Arha in Devara : ” దేవర ” సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ ….పెద్ద చాన్సే కొట్టేసిందిగా…

Allu Arha in Devara  :  ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ నేతృత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా లైన్ ఏంటనేది ఓపెనింగ్ రోజే రివీల్ చేస్తూ కొరటాల శివ ఈ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు. ఇక దేవర సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయగా….ఇటీవల […]

  • Published On:
Allu Arha in Devara : ” దేవర ” సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ ….పెద్ద చాన్సే కొట్టేసిందిగా…

Allu Arha in Devara  :  ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ నేతృత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా లైన్ ఏంటనేది ఓపెనింగ్ రోజే రివీల్ చేస్తూ కొరటాల శివ ఈ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు. ఇక దేవర సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయగా….ఇటీవల కిల్లర్ సీక్వెన్స్ కంప్లీట్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. అంతేకాక ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను సినిమా బృందం తెలియజేసింది.

allu-arjuns-daughter-playing-a-role-in-the-movie-of-devara

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు దేవర సినిమా లో నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల దేవర సినిమాకు సంబంధించిన ఇంపార్టెంట్ షెడ్యూల్ పూర్తి కాగా , అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాలో గెస్ట్ రూల్ లో కనిపించబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాహ్నవి కపూర్ చిన్ననాటి పాత్రలో అల్లు అర్హ నటించనుందట. అయితే ఈ విషయాన్ని దేవర సినిమా బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. దీంతో అల్లు ఫాన్స్ ఈ వార్త నిజం కావాలని ఆశిస్తున్నారు.

allu-arjuns-daughter-playing-a-role-in-the-movie-of-devara

ఇక అర్హ విషయానికొస్తే ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకంతులం సినిమాలో బాల భరతుడిగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందనప్పటికీ అర్హ పర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో స్టార్ హీరో తో పాన్ ఇండియా రేంజ్ లో తనకెక్కుతున్న దేవర సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ చిన్నారి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.