Alia Bhatt : అలియాభట్ పై కన్నేసిన కేటుగాళ్లు…

Alia Bhatt : అధునాతన సాంకేతికతను ఆధారంగా చేసుకొని రోజురోజుకీ సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సినీ తారలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక , కత్రినా కైఫ్ ,కాజోల్ కు సంబంధించిన  ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫేక్ వీడియోలను మర్చిపోకముందే తాజాగా మరో వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలీవుడ్ కు చెందిన […]

  • Published On:
Alia Bhatt : అలియాభట్ పై కన్నేసిన కేటుగాళ్లు…

Alia Bhatt : అధునాతన సాంకేతికతను ఆధారంగా చేసుకొని రోజురోజుకీ సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సినీ తారలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక , కత్రినా కైఫ్ ,కాజోల్ కు సంబంధించిన  ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫేక్ వీడియోలను మర్చిపోకముందే తాజాగా మరో వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ అలియా భట్ వీడియో బయటకు వచ్చింది. అయితే అసభ్యకరంగా వ్యవహరిస్తున్న మహిళ వీడియోకు ఆలియా ముఖాన్ని జత చేసి ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సినీ తారలను ఇబ్బంది పెట్టటం సమంజసం కాదని నేటిజనులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియాలో జార పటేల్ అనే సోషల్ మీడియా తార వీడియోకి రష్మిక ముఖాన్ని జత చేసి వీడియో క్రియేట్ చేశారు.

ఇక ఈ వీడియో పై అమితాబచ్చన్, కీర్తి సురేష్ ,నాగచైతన్య విజయ్ దేవరకొండ వంటి సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ వీడియోలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ఐటి శాఖ కూడా ఈ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను తీసుకువచ్చే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలియజేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆకతాయిలు మాత్రం చెలరేగిపోతున్నారు. వీరిని కట్టుదిట్టం చేయకపోతే రానున్న రోజుల్లో ఇది మరింత విధ్వంసకరానికి దారి తీయవచ్చు అని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.