Heroine Meena : ఆ స్టార్ హీరో అంటే మీనాకి పిచ్చి .. అందుకే అతనితో కలిసి _??

Heroine Meena  : ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. టాలీవుడ్ లో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఇలా స్టార్ హీరో అందరితో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే మీనా తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఓపెన్గా […]

  • Published On:
Heroine Meena : ఆ స్టార్ హీరో అంటే మీనాకి పిచ్చి .. అందుకే అతనితో కలిసి _??

Heroine Meena  : ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. టాలీవుడ్ లో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఇలా స్టార్ హీరో అందరితో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే మీనా తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఓపెన్గా చెప్పుకొచ్చారు. నటి సుహాసిని తమిళంలో సినీ ఉలగం అనే చాట్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల ఈ షోకు మీనా హాజరైంది.

ఈ షోలో మీనా మాట్లాడుతూ తనకు ఓ బాలీవుడ్ నటుడితో క్రష్ ఉందని చెప్పింది. అతడికి పెళ్లి అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను అని తెలిపింది. మీనా ఇష్టపడ్డ హీరో మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ అంటే చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు. అలాగే హీరోయిన్స్ కూడా చాలామంది ఇష్టపడతారు. ఈ క్రమంలోని అందరిలాగే మీనా హృతిక్ రోషన్ ఇష్టపడింది. అలాంటివాడు భర్తగా రావాలని కలలు కన్నది. ఇంకా మీనా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.

నేను కృతి రోషన్ ను చాలా ఇష్టపడ్డాను. హృతిక్ లాంటి అబ్బాయి కావాలని అమ్మకు చెప్పాను. హృతిక్ పెళ్లి రోజు నా గుండె పగిలింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి జరగలేదు అని మీనా చెప్పింది. మీనా హృతిక్ ని కలిసిన పాత ఫోటోను సుహాసిని షోలో షేర్ చేసింది. ఈ సందర్భంగా హృతిక్ పై ఉన్న ప్రేమను మీనా వెల్లడించింది. ఇక తన కూతురు సినీ ఎంట్రీ కోసం మాట్లాడుతూ నా కూతురు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు. ఇక మీనా కుమార్తె నైనిక విజయ్ దళపతి నటించిన తేరీ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.