Samantha Temple : సమంత కు గుడి కట్టించిన వీరాభిమాని…ఈ విషయం తెలుసుకున్న సమంత ఏం చేసిందంటే..

Samantha Temple : సినీ తారలను ప్రాణంగా అభిమానించే వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రేక్షకులకు ఉండే అభిమానం అయితే మాటల్లో చెప్పలేం. అంతేకాక మూవీ సెలబ్రిటీలను ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. వారు కొత్తగా ఏం చేసినా వారు అదే చేయాలనుకుంటారు. సెలబ్రిటీస్ లాగానే హెయిర్ కట్ చేయించుకోవడం, వాళ్ల మాదిరిగా డ్రెస్సు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక అభిమాన తారల సినిమాలు విడుదల అయితే చాలు,టపాసులు పేలుస్తూ పాలాభిషేకం చేస్తూ థియేటర్ల […]

  • Published On:
Samantha Temple : సమంత కు గుడి కట్టించిన వీరాభిమాని…ఈ విషయం తెలుసుకున్న సమంత ఏం చేసిందంటే..

Samantha Temple : సినీ తారలను ప్రాణంగా అభిమానించే వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రేక్షకులకు ఉండే అభిమానం అయితే మాటల్లో చెప్పలేం. అంతేకాక మూవీ సెలబ్రిటీలను ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. వారు కొత్తగా ఏం చేసినా వారు అదే చేయాలనుకుంటారు. సెలబ్రిటీస్ లాగానే హెయిర్ కట్ చేయించుకోవడం, వాళ్ల మాదిరిగా డ్రెస్సు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక అభిమాన తారల సినిమాలు విడుదల అయితే చాలు,టపాసులు పేలుస్తూ పాలాభిషేకం చేస్తూ థియేటర్ల ముందు పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు కొంత మంది అభిమానులు ఏకంగా సినీ తారలకు ఆలయాలను కూడా కట్టిస్తున్నారు.

Samantha Ruth Prabhu's fan unveils her idol on her birthday, dedicates a temple to her

అయితే ఇంతకు మునుపే ఈ సంఘటన తమిళనాడులో చూసాం . తమిళనాడులో హీరోయిన్లు కుష్బూ సుందర్ , అనుష్క మోత్వానీ , నయనతారలకు వారి ఫాన్స్ గుడి కట్టించడం గురించి వినే ఉంటారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు ఆమె అభిమాని గుడి కట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంతకు ఆమె వీరాభిమాని గుడి కట్టించారు. తను ప్రాణంగా అభిమానించే సమంత విగ్రహాన్ని చేయించి , ఆలయాన్ని నిర్మించాడు . అంతేకాక ఆమె పేరిట అన్నదానం కూడా నిర్వహించాడు. ఎన్జీవోలు పెట్టి చాలామందికి సాయం చేయడంతో పాటు పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించే సమంత అంటే తనకు ఎంతగానో ఇష్టమని అందుకే ఆమెకు గుడి కట్టించినట్లు అభిమాని తెలియజేశాడు.

Watch Fan build's temple of Samantha Ruth Prabhu

 

అయితే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన సందీప్ అనే వ్యక్తి సమంత గుడి కట్టించడం జరిగింది. సమంతకు సందీప్ గుడి కట్టించడం పై ఆయన భార్య హర్షం వ్యక్తం చేశారు. తాను కూడా ఎంతో అభిమానించే హీరోయిన్ సమంతకు నా భర్త గుడి కట్టించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. సమంతకు గుడి కట్టాలి అని చాలా ఏళ్లుగా అనుకుంటున్నాం కానీ ఇప్పటికి కుదిరింది. రోజులో ఒక్కసారైనా మా ఇంట్లో సమంత టాపిక్ మాట్లాడుకుంటామంటూ సందీప్ భార్య చెప్పుకొచ్చింది. దీంతో ఈ న్యూస్ స్థానికంగా చర్చానియాంశంగా మారింది. అంతేకాక సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ న్యూస్ తెలుసుకున్న తరువాత నెటిజనులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.