Trisha Krishnan : బహుభాషా నటి త్రిష గురించి ఎవరికి తెలియని విషయాలు…. మీకోసం…

Trisha Krishnan : ఇండస్ట్రీలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో త్రిష కృష్ణన్ ఒకరు. అయితే త్రిష మొదటిగా 1999లో జోడి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక తర్వాత 2002లో సూర్య హీరోగా నటించిన “మౌనం పేసుదే” అనే సినిమాలో నటించి హీరోయిన్ గా మారింది. అప్పటినుండి దాదాపుగా 20 ఏళ్లు గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. అంతేకాక ఇప్పటికీ […]

  • Published On:
Trisha Krishnan : బహుభాషా నటి త్రిష గురించి ఎవరికి తెలియని విషయాలు…. మీకోసం…

Trisha Krishnan : ఇండస్ట్రీలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో త్రిష కృష్ణన్ ఒకరు. అయితే త్రిష మొదటిగా 1999లో జోడి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక తర్వాత 2002లో సూర్య హీరోగా నటించిన “మౌనం పేసుదే” అనే సినిమాలో నటించి హీరోయిన్ గా మారింది. అప్పటినుండి దాదాపుగా 20 ఏళ్లు గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. అంతేకాక ఇప్పటికీ ఆమె హీరోయిన్గా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ ,మలయాళం,హిందీ భాషల్లో కూడా త్రిష నటిస్తూ వస్తుంది.

10-interesting-facts-about-actress-trisha-krishnan

మునపటి కంటే ఇప్పుడు కొంచెం అవకాశాలు తగ్గినప్పటికీ హీరోయిన్గా మాత్రం త్రిష అవుట్ డేట్ అయిపోలేదు. ఏడాదిలో రెండు మూడు సినిమాల్లో కచ్చితంగా నటిస్తూనే వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటించిన కొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందించింది. దాదాపుగా 20 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న గ్లామర్ బ్యూటీ త్రిష నిన్నటి రోజున 40వ పుట్టినరోజు జరుపుకుంది . ఈ సందర్భంగా త్రిష కు సంబంధించిన పది ఆసక్తికరమైన విషయాలను మీకోసం తీసుకొచ్చాం…

10-interesting-facts-about-actress-trisha-krishnan

* త్రిష 1983 మే 4న తమిళనాడులో జన్మించారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. త్రిష సాక్రేడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎథిరాజ్ కాలేజీలో బీబీఏ పూర్తి చేసింది.

* త్రిష సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో చేసేవారట . అప్పుడు పలు పోటీలలో పాల్గొని విజయం కూడా సాధించారు.

* త్రిష మొదటిగా జోడి అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో త్రిష హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించారు.

*త్రిష తన మొదటి సినిమా అయినా జోడి లో నటించినప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.

* త్రిష సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పలు రకాల యాడ్లలో నటించారు. అలాగే 19 ఏళ్ల వయసులో హార్లిక్స్ యాడ్లో త్రిష తల్లి పాత్ర లో కనిపించారు.

* త్రిష కన్నడ భాషలో కేవలం ఒక్క సినిమాను మాత్రమే చేయడం గమనార్హం. 2014లో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ తో త్రిష నటించింది.

* త్రిష ఇంట్లో తన అమ్మ గారితో కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడతారట.

* త్రిష కు జంతు ప్రేమ ఎక్కువ. దీంతో వీధి కుక్కలను కూడా ఆమె పెంచుకుంటుందని సమాచారం.