Sabarimala : శబరిమల ఆలయంలో దారుణం… పూజారి మృతి…

Sabarimala : శబరిమల అయ్యప్ప ఆలయంలో సహాయ పూజారిగా వ్యవహరిస్తున్న పూజారి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. అయితే ఆ పూజారి తమిళనాడులోని కుంభకోణానికి చెందిన రామ్ కుమార్ 43 గా గుర్తించారు. గురువారం ఉదయం ఆలయంలోని గదిలో పూజారి కుప్పకూలి ఉండడాన్ని కొందరు గమనించారు. గుర్తించిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన నేపథ్యంలో నిన్నటి రోజున ఆలయాన్ని దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచి శుద్ధి కార్యక్రమం […]

  • Published On:
Sabarimala : శబరిమల ఆలయంలో దారుణం… పూజారి మృతి…

Sabarimala : శబరిమల అయ్యప్ప ఆలయంలో సహాయ పూజారిగా వ్యవహరిస్తున్న పూజారి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. అయితే ఆ పూజారి తమిళనాడులోని కుంభకోణానికి చెందిన రామ్ కుమార్ 43 గా గుర్తించారు. గురువారం ఉదయం ఆలయంలోని గదిలో పూజారి కుప్పకూలి ఉండడాన్ని కొందరు గమనించారు. గుర్తించిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన నేపథ్యంలో నిన్నటి రోజున ఆలయాన్ని దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచి శుద్ధి కార్యక్రమం అనంతరం ఆలయాన్ని తెరిచారు . కేరళలోని పతనం తిట్ట జిల్లాలో పవిత్ర క్షేత్రమైన శబరిమల ఆలయంలో మకర విళక్కు పూజలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విచ్చేస్తున్నారు. అయితే గుడిలో సహాయ పూజారి హఠాత్తుగా మరణించడంతో శుద్ధి కార్యక్రమం అనంతరం 20 నిమిషాల ఆలస్యంగా ఆలయాన్ని తెరిచారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూడక తప్పలేదు. మరోవైపు అయ్యప్ప సన్నిధానంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని వెంటనే నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా పతనం తిట్ట జిల్లా కలెక్టర్ పోలీసులకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గత కొద్ది రోజుల నుండి అయ్యప్ప దర్శనం కోసం భక్తులు దాదాపు పది గంటలకు పైగా నిరీక్షిస్తూన్నారు.

ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇక దర్శనం కోసం వచ్చే భక్తులలో దాదాపు 20 శాతం మంది భక్తులు మహిళలు పిల్లలు ఉన్నారని దేవస్థానం బోర్డు తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ అనిల్ కే నరేంద్రన్ ,జస్టిస్ జి గిరీష్ లతో కూడిన డివిజన్ బెంచ్ వాహనాల పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ కూడా సరిగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా భక్తుల కోసం వెళతావాళ్ళ వద్ద సౌకర్యాలు కల్పించాలని ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు నిర్వహించాలని తెలియజేసింది.