Manchu Lakshmi : స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తే తప్పేంటి…మంచు లక్ష్మి…

Manchu Lakshmi : స్వలింగ సంపర్కుల వివాహాలపై ఇటివల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మి స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో తన గుండె పగిలిపోయిందని తెలియజేశారు.అన్ని రకాల ప్రేమలను స్వీకరించి బయట ప్రపంచానికి నిజమైన ప్రేమ గురించి […]

  • Published On:
Manchu Lakshmi : స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తే తప్పేంటి…మంచు లక్ష్మి…

Manchu Lakshmi : స్వలింగ సంపర్కుల వివాహాలపై ఇటివల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మి స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో తన గుండె పగిలిపోయిందని తెలియజేశారు.అన్ని రకాల ప్రేమలను స్వీకరించి బయట ప్రపంచానికి నిజమైన ప్రేమ గురించి బోధించే భారతదేశానికి ఇది నిజంగా అవమానం అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇతర దేశాలలో ఎవరికి వారే స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు.

whats-wrong-with-legalizing-gay-marriage-manchu-lakshmi

స్వలింగ సంపర్కులు కూడా ఇతర దేశాలలో స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటిది మనదేశంలో స్వలింగ వివాహాలను అంగీకరించలేమా .? అంటూ మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.దీంతో ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా 2018లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కుల సహజీవనం నేరం కాదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వలింగ సంపర్కుల వివహాలను చట్టబద్ధం చేయాలని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ , పారిస్ మ్యారేజ్ యాక్ట్ లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో 18 పిటిషన్లు దాఖలు అయ్యాయి.  ఇక వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది.

whats-wrong-with-legalizing-gay-marriage-manchu-lakshmi

ఏల్జీబీటీల కోసం చట్టాలను మార్చడం కుదరదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. అలాగే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని ప్రకటించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధత చేయాల లేదా అన్న నిర్ణయం పార్లమెంట్ నిర్ణయిస్తుందని తెలియజేసింది. అయితే చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ స్వలింగ సంపర్కుల సహజీవనం తప్పు కాదని తెలియజేసింది. అలాగే స్వలింగ సంపర్కుల జంటల పై వివక్షత చూపించవద్దని వారి హక్కులను కూడా కాపాలనడాలంటూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది.