Viral Video : ఈ జింక కాన్ఫిడెన్స్ చిరుత షాక్…ఇలాంటి వీడియో ఎప్పుడూ చూసి ఉండరు…
Viral Video : ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులలో చిరుత పులి కూడా ఒకటని చెప్పాలి. అందుకే అడవిలో చిరుత కంట్లో ఏదైనా జంతువు పడిందంటే అది దాని నోటికి చిక్కికి తీరాల్సిందే. చిరుత కన్నా వేగంగా పరిగెత్తే జంతువులు కూడా దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం.అందుకే చిరుత పులిని గమనించిన వెంటనే జంతువులు పరుగులు పెడతాయి. అలాంటి చిరుతను చూసి కనీసం పట్టించుకోకుండా గడ్డిమేస్తున్న జింక ని ఎప్పుడైనా చూశారా…? ఇది నిజం అంటే […]
Viral Video : ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులలో చిరుత పులి కూడా ఒకటని చెప్పాలి. అందుకే అడవిలో చిరుత కంట్లో ఏదైనా జంతువు పడిందంటే అది దాని నోటికి చిక్కికి తీరాల్సిందే. చిరుత కన్నా వేగంగా పరిగెత్తే జంతువులు కూడా దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం.అందుకే చిరుత పులిని గమనించిన వెంటనే జంతువులు పరుగులు పెడతాయి. అలాంటి చిరుతను చూసి కనీసం పట్టించుకోకుండా గడ్డిమేస్తున్న జింక ని ఎప్పుడైనా చూశారా…? ఇది నిజం అంటే నమ్ముతారా…?వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే నమ్మక మానరు. అయితే IFS అధికారి సుశాంత్ నంద గతంలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ జింక గడ్డిమేస్తూ ఉంటుంది.
గడ్డిమేస్తున్న జింకను చూసిన ఓ చిరుత నెమ్మదిగా దాని దగ్గరికిి వచ్చింది. వెంటనే జింకపైకి దాడికి ప్రయత్నించింది. కానీ జింక మాత్రం కనీసం దానిని పట్టించుకోలేదు. అంతేకాక కనీసం దానిని చూసి భయపడలేదు. ఎందుకంటే చిరుతకు జింకకు మధ్యలో ఇనుపకంచె ఒకటి ఉంది. దీంతో చిరుత ఎలాగో ఇటువైపు రాలేదనే ధైర్యంతో జింక ప్రశాంతంగా గడ్డి తింటూ ఉండిపోయింది. ఈ క్రమంలోనే చిరుతను కనీసం పట్టించుకోలేదు. ఇక జింకను చూసి షాక్ అయిన చిరుత పలుసార్లు గర్జించినప్పటికీ జింక మాత్రం కాస్త కూడా భయపడలేదు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్నో లక్షల మంది ఈ వీడియోని చూసి లైక్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ జింక కాన్ఫిడెన్స్ అమోఘం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Window shopping by Cheetah… pic.twitter.com/x3p7PvdNS6
— Susanta Nanda (@susantananda3) March 12, 2022