Viral Video : రోడ్డు దాటడానికి ఈ కుర్రాడు వేసిన ప్లాన్ అదుర్స్ .. ఒకసారి మీరే చూడండి ..

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి, మరికొన్ని వీడియోలు ఫన్నీగా అనిపిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొంచెం ఫన్నీగా, కొంచెం ఆలోచింపజేసేలా ఉంది. ఈ వీడియోలో ఓ కుర్రాడు రోడ్డు దాటడానికి అద్భుతమైన ఆలోచన చేశాడు. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబు మీకు అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మన భారత […]

  • Published On:
Viral Video : రోడ్డు దాటడానికి ఈ కుర్రాడు వేసిన ప్లాన్ అదుర్స్ .. ఒకసారి మీరే చూడండి ..

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి, మరికొన్ని వీడియోలు ఫన్నీగా అనిపిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొంచెం ఫన్నీగా, కొంచెం ఆలోచింపజేసేలా ఉంది. ఈ వీడియోలో ఓ కుర్రాడు రోడ్డు దాటడానికి అద్భుతమైన ఆలోచన చేశాడు. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబు మీకు అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మన భారత దేశంలో నగరాల్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ముఖ్యంగా మెట్రో నగరాల్లో రోడ్డు దాటడం అంటే మామూలు విషయం కాదు. వాహనాల రతితో ఎంతో బిజీగా ఉండే దాటడం చాలా కష్టం. అయితే ఒక కుర్రోడు రోడ్డు దాటడానికి సులభమైన మార్గం ఎంచుకున్నాడు. ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Adil Loui అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వికలాంగుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు.

చేతులతో సంజ్ఞలు చేస్తూ వాహనాలను ఆగమని చెప్పి కుంటు కుంటూ రోడ్డు దాటాడు. కొద్ది దూరం వెళ్లాక మామూలుగా మారిపోయి స్టైల్‌గా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. అంటే రోడ్డు దాటడానికి ఆ యువకుడు వేసిన అద్బుతమైన ప్లాన్ అన్నమాట. ఆ కుర్రాడి చేష్టలను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన డిజైన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్రదర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఇప్పటిదాకా ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్స్ వచ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by Adil Loui (@adil_loui)