Palm Toddy : వేసవిలో కల్లు తాగడం వలన ఇన్ని ప్రయోజనాల…మరి ముఖ్యంగా ఆ పనికి..

Palm Toddy : కల్లు అంటే తెలియనివారు ఎవరు ఉండరు కాబోలు. తెల్లగా కనిపించే ఈ పానీయాన్ని తాగితే నిసా వస్తుంది. నాచురల్ గా లభించే ఈ ఆల్కహాల్ డ్రింక్ ను భారతదేశవ్యాప్తంగా తాగుతుంటారు. అంతేకాక ప్రభుత్వం కూడా దీనికి మద్దతినిస్తూ ఆ , యా వృత్తి వారిని ప్రోత్సహిస్తుంది. అయితే కల్లును ఈత చెట్టు, తాటిచెట్టు, కొబ్బరి చెట్లనుండి తీస్తుంటారు. అయితే మొదటిగా చెట్టు నుండి తీసిన ద్రావణాన్ని నీరా అంటారు. ఇది క్రమంగా పులిసి […]

  • Published On:
Palm Toddy : వేసవిలో కల్లు  తాగడం వలన ఇన్ని ప్రయోజనాల…మరి ముఖ్యంగా ఆ పనికి..

Palm Toddy : కల్లు అంటే తెలియనివారు ఎవరు ఉండరు కాబోలు. తెల్లగా కనిపించే ఈ పానీయాన్ని తాగితే నిసా వస్తుంది. నాచురల్ గా లభించే ఈ ఆల్కహాల్ డ్రింక్ ను భారతదేశవ్యాప్తంగా తాగుతుంటారు. అంతేకాక ప్రభుత్వం కూడా దీనికి మద్దతినిస్తూ ఆ , యా వృత్తి వారిని ప్రోత్సహిస్తుంది. అయితే కల్లును ఈత చెట్టు, తాటిచెట్టు, కొబ్బరి చెట్లనుండి తీస్తుంటారు. అయితే మొదటిగా చెట్టు నుండి తీసిన ద్రావణాన్ని నీరా అంటారు. ఇది క్రమంగా పులిసి మడ్డి ద్వారా కళ్ళు అవుతుంది. అయితే దీనిలో పొటాషియం, సోడియం మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. శారీరక శ్రమ ద్వారా కోల్పోయిన ఈ ద్రావణాలను , ఖనిజాలను మరల తిరిగి శరీరంలో నింపేందుకు ఇది దోహదపడుతుంది.

there-are-so-many-benefits-of-drinking-toddy-in-summer-and-especially-for-that-work

అందుకే దీన్ని ఎక్కువగా ఎండాకాలంలో తాగుతుంటారు. అయితే ఈ ద్రావణం పల్లెటూర్లలో చాలా పుష్కలంగా లభిస్తుంది. రకరకాల పేర్లతో పిలిచే కల్లును పామ్ జాతికి చెందిన తాటి చెట్టు, ఈత చెట్టు కొబ్బరి చెట్టు , ఖర్జూరం వంటి చెట్ల నుండి తీస్తుంటారు. అయితే దీనిని ఉత్తర భారత దేశంలో నీరా అంటారు. మన తెలంగాణ , మరియు దక్షిణ భారత రాష్ట్రాల్లో తాటికల్లు ,ఈతకల్లు అంటూ పిలుస్తుంటారు. అయితే తెలంగాణలో ఈతకల్లు , తాటి కల్లు సేవించే ప్రజలు చాలామంది ఉన్నారు. దీంతో ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం హైదరాబాదులో కూడా కల్లు దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం సైతం మద్దతు ఇచ్చి ప్రోత్సహించే అంత ఈ కల్లులో ఏముంది అనుకుంటున్నారా. అయితే దీని ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే… ఇక వివరాల్లోకెళ్తేతే…

there-are-so-many-benefits-of-drinking-toddy-in-summer-and-especially-for-that-work

క్యాన్సర్ కు చెక్…

తాటికల్లులో యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ b2 ఉంటుంది. ఇది క్యాన్సర్ ను కలిగించే , ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంతోపాటు శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ఈ విషయాన్ని ఇటీవల ఓ పిహెచ్ డి తీసేస్ కూడా నిర్ధారించడం జరిగింది. అందుకే కల్లుని చాలా దేశాల్లో క్యాన్సర్ కు నివారణ ఔషధంగా ఉపయోగిస్తుంటారు.

there-are-so-many-benefits-of-drinking-toddy-in-summer-and-especially-for-that-work

కంటికి మంచిది…

కల్లులో విటమిన్ సి మరియు థయామిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రజలు తమ దృష్టిని పెంచుకోవడానికి కూడా తాజా తాటి లేదా ఈతకల్లును తాగుతుంటారు. మరి ముఖ్యంగా పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలో కంటి ఆరోగ్యం కోసం ఈ డ్రింక్ ని ఎక్కువగా తీసుకుంటుంటారు.

there-are-so-many-benefits-of-drinking-toddy-in-summer-and-especially-for-that-work

గుండె సమస్యలు రాకుండా….

కల్లుని మితంగా తాగితే గుండె జబ్బులు దరి చేరవట. ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోచాలా బాగా సహాయ పడతాయి. అలాగే కల్లు త్రాగడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

there-are-so-many-benefits-of-drinking-toddy-in-summer-and-especially-for-that-work

తల్లులలో పాల ఉత్పత్తికి…

తల్లులలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ఆఫ్రికా వంటి దేశాల్లో కల్లును ఉపయోగిస్తారు. బాలింతలలో బ్రెస్ట్ మిల్క్ తగ్గినప్పుడు , కల్లు ఆ సమస్యను తగ్గించి పాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడుతుంది.

జ్వరానికి ముందు…

కల్లు అనేది జలుబు మరియు జ్వరాలు వంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మితిమీరి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. అలాగే కల్లును కూడా అధికంగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో లభించే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది
తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.