Viral News : భర్తను 5 లక్షల కు అమ్మేసిన భార్య…శుభలగ్నం సినిమా రిపీట్…

Viral News  : ప్రస్తుత కాలంలో చాలాచోట్ల వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వింత సంఘటనలలో భార్యాభర్తల వివాదాలు ఒకటి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు మనం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని భర్తను వదిలేసిన యువతిని చూసాం…పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించారని తెలిసి ప్రియురాలికి భర్తని ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళని కూడా చూసాం.ఇక మరికొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారన్న కారణాలతో గొడవలు పడి విడాకులు తీసుకున్న ఘటనలు కూడా చూశాం.కానీ ఇప్పుడు […]

  • Published On:
Viral News : భర్తను 5 లక్షల కు అమ్మేసిన భార్య…శుభలగ్నం సినిమా రిపీట్…

Viral News  : ప్రస్తుత కాలంలో చాలాచోట్ల వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వింత సంఘటనలలో భార్యాభర్తల వివాదాలు ఒకటి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు మనం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని భర్తను వదిలేసిన యువతిని చూసాం…పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించారని తెలిసి ప్రియురాలికి భర్తని ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళని కూడా చూసాం.ఇక మరికొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారన్న కారణాలతో గొడవలు పడి విడాకులు తీసుకున్న ఘటనలు కూడా చూశాం.కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన అచ్చం శుభలగ్నం సినిమాలో జరిగినట్లుగా జరిగింది. అచ్చం సినిమాలో మాదిరిగా ఓ భార్య తన భర్తని ప్రియురాలుకి అమ్మేసింది.

the-wife-who-sold-her-husband-for-5-lakhs

శుభలగ్నం సినిమాలో కోటి రూపాయల కోసం ఆమని తన భర్త అయిన జగపతిబాబును రోజాకు అమ్మినట్లుగా ఇక్కడ ఓ భార్య తన భర్త ను ప్రియురాలికి 5 లక్షలకి విక్రయించింది.  దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక భార్య మరియు ప్రియురాలు మధ్య కుదిరిన డీల్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే…ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య కు సమీపంలో గల ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే స్థానికంగా అక్కడ నివాసముంటున్న ఓ గృహిణి తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటానికి గమనించింది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు పడక గదిలో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  ఈ క్రమంలోనే వారిద్దరిని నిలదీసి పెద్దమనుషుల సమక్షంలో నిలబెట్టింది.

ఈ క్రమంలోనే పంచాయతీలో ప్రియురాలు మాట్లాడుతూ ఆమె భర్తను తనకి అప్పగించాల్సిందిగా కోరింది. లేకుంటే అతను తీసుకున్న అప్పును చెల్లించాల్సిందిగా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బాగా ఆలోచించిన భార్య ఇలాంటి భర్త ఉన్న ఒక్కటే లేకపోయినా ఒకటే అనుకుందేమో…తనకు మరో 5 లక్షలు ఇస్తే తన భర్తను ఇచ్చేస్తానని ప్రతిపాదించింది.ఇక దీనికి ప్రియురాలు అంగీకరించడంతో ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. ప్రియురాలు కూడా ఐదు లక్షలు చెల్లించేందుకు అంగీకరించడంతో భర్త బదిలీ పూర్తయింది. ఈ మేరకు పెద్ద మనుషుల సమక్షంలోనే అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారట. ఇక వీరిద్దరి మధ్య ఒప్పందం చూసి స్థానిక ప్రజలు మరియు గ్రామ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారింది.