Srisailam : శ్రీశైలం ప్రసాదంలో ఎముక క్లారిటీ ఇచ్చిన ఆలయ అర్చకులు…

Srisailam  : పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవస్థానలలో శ్రీశైలం ఒకటిగా చెప్పుకోవాలి. అయితే శ్రీశైలంలో స్వామి వారి ప్రసాదాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక అలాంటి దేవస్థానాలలో ప్రతిష్ట జరిగినప్పుడు భక్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతారు. అయితే గత కొన్ని రోజులు కిందట నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గారు దేవాలయంలో పులిహోరలో ఎముక వచ్చిందని పలు రాకల వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం పలు రకాల పత్రికలో కూడా రావడం […]

  • Published On:
Srisailam : శ్రీశైలం ప్రసాదంలో ఎముక క్లారిటీ ఇచ్చిన ఆలయ అర్చకులు…

Srisailam  : పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవస్థానలలో శ్రీశైలం ఒకటిగా చెప్పుకోవాలి. అయితే శ్రీశైలంలో స్వామి వారి ప్రసాదాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక అలాంటి దేవస్థానాలలో ప్రతిష్ట జరిగినప్పుడు భక్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతారు. అయితే గత కొన్ని రోజులు కిందట నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గారు దేవాలయంలో పులిహోరలో ఎముక వచ్చిందని పలు రాకల వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం పలు రకాల పత్రికలో కూడా రావడం జరిగింది. ఇక ఈ ఘటనపై శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు విషయానికి వస్తే ఆలయంలో ప్రసాదులు ఎంతో నియమం నిష్ఠలతో తయారుచేస్తారు.

అలాగే రోజువారి ప్రసాదాల తయారీ కూడా ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో జరుగుతాయి అని చెప్పారు. ఇక ప్రసాద పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఉంచుతారట. వంటశాలలోకి విధులు నిర్వహించే సిబ్బంది తప్ప ఇతరులు ఎవ్వరు ప్రవేశించడానికి వీలు లేదు అని అన్నారు. ఇక పులిహోర ప్రసాదం లో ఎముక వచ్చిందనే వార్త వాస్తవం కాదని ఆలయ అర్చకులు కొట్టిపడేశారు. అలాగే శ్రీశైలం క్షేత్ర ప్రతిష్టను భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ఘటన తమను ఎంతో మనోవేదన గురి చేసింది అని ఆయన పేర్కొన్నారు. అయితే గత 35 సంవత్సరాల నుంచి శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో

శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి ప్రధాన అర్చకులుగా సేవలు అందిస్తున్నామన్నారు. స్వామివారికి మరియు అమ్మవారి నైవేద్య ప్రసాదాలను భక్తులకు అందజేస్తూ తమ జీవన కొనసాగిస్తున్నామని అన్నారు. ఇక ఈ విషయంపై పలు సందేహాలకు దారితిస్తున్నాయి అన్నారు. అలాగే వార్త పత్రికలో వచ్చినటువంటి వార్త మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి అని ఆయన తెలిపారు. అయితే ఈ విధంగా వార్తలు రావడం వల్ల వారే ముందుకు వచ్చి ఈ ఘటన సంబంధించిన స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు తెలపడం జరిగింది. అయితే ఈ విషయంలో వచ్చిన వార్తలు అన్ని నిజం కాదని భక్తులందరికీ స్వామి అర్చకులు కృష్ణశర్మ అవధాని శ్రీ అమ్మవారి ప్రధానార్చకులు మార్కేండేయ శాస్త్రి సూచించారు.