Viral Video : భర్తపై ఆమెకున్న ప్రేమను తెలిపేందుకు ఈ మహిళ ఏం చేసిందో చూడండి..ఈ కాలంలో ఇలాంటివారు కూడా ఉన్నారా….?

Viral Video : ప్రేమలో ఉన్నవారు తరచుగా వారు ప్రేమించిన వారికోసంం ప్రత్యేకమైన హవభావాలను వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎలాగైనా వారి ప్రేమను తెలియజేయాలని చూస్తుంటారు. ఇక వారికి ఇష్టమైన పనులు చేస్తూ వారిని ఆశ్చర్యపరుస్తూ వారి పార్ట్నర్ పొందే ఆనందాన్ని వారు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన భర్త పేరును పచ్చబొట్టు ద్వారా తనపై ఆమెకున్న ప్రేమను తెలిపేందుకు ప్రయత్నించింది. అయితే ప్రస్తుత […]

  • Published On:
Viral Video : భర్తపై ఆమెకున్న ప్రేమను తెలిపేందుకు ఈ మహిళ ఏం చేసిందో చూడండి..ఈ కాలంలో ఇలాంటివారు కూడా ఉన్నారా….?

Viral Video : ప్రేమలో ఉన్నవారు తరచుగా వారు ప్రేమించిన వారికోసంం ప్రత్యేకమైన హవభావాలను వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎలాగైనా వారి ప్రేమను తెలియజేయాలని చూస్తుంటారు. ఇక వారికి ఇష్టమైన పనులు చేస్తూ వారిని ఆశ్చర్యపరుస్తూ వారి పార్ట్నర్ పొందే ఆనందాన్ని వారు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన భర్త పేరును పచ్చబొట్టు ద్వారా తనపై ఆమెకున్న ప్రేమను తెలిపేందుకు ప్రయత్నించింది. అయితే ప్రస్తుత కాలంలో పచ్చబొట్టు అనేది సాధారణమే అయినప్పటికీ నుదుటిపై వేయించుకోవడం అంటే తేలికైన విషయం కాదు.

దీంతో ఈ వీడియో క్లిప్ చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోను బెంగళూరుకు చెందిన ” కింగ్ మేకర్ టాటూ స్టూడియో” అనే టాటూ పార్లర్ వారు వారి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ఇక ఈ వీడియోలో మహిళ కుర్చీ పై కూర్చొని ఉండగా, తన భర్త అయినా సతీష్ పేరును నుదుటి పై పచ్చ బొట్టుగా వేయించుకోవడం చూడవచ్చు. టాటూ వేసే వ్యక్తి మొదట పేరు ఉ కాగితంపై రాసి ఫాంటు సైజ్ చూసేందుకు దానిని ఆమె నుదుటి కి అతికిస్తాడు. ఆ సందర్భంలో మహిళ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. అయితే టాటూ వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆమె కొంచెం అసౌకర్యానికి గురైంది.

అయితే ఆమెకు తన భర్తతో ఉన్న ప్రేమను చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.ఈ కాలంలో ఇలాంటివారు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వీడియో క్లిప్ పై ట్రూ లవ్ అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ను మార్చి 18న సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అప్పటినుండి ఇప్పటివరకు 12.5 మిలియన్ వ్యూస్ మరియు 2.5 లక్షల లైకులను సంపాదించింది. అయితే ఈ వీడియో చూశాక కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే ,మరి కొందరు నిజమైన ప్రేమను నిరూపించాలంటే ఇలాంటి పనిచేయాల్సిన అవసరం లేదంటూ, ప్రేమించిన వారిపట్ల ఆప్యాయత ప్రాధాన్యత, ప్రేమ మరియు వారిని అర్థం చేసుకోవడం లాంటివి చేస్తే చాలని కామెంట్స్ చేస్తున్నారు.