Prabhas Marriage : వచ్చే ఏడాది కల్లా ప్రభాస్ పెళ్లి కచ్చితంగా చేస్తా…శ్యామలాదేవి సంచలన వ్యాఖ్యలు…

Prabhas Marriage : ప్రస్తుత కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరి పెళ్లిళ్లు చేసుకుంటూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ తన పెళ్లిపై ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పకుండా అభిమానులను డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నారు. భారీ భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించినప్పటికీ పెళ్లి కూడా చేసుకుంటే బాగుండు అని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు పెళ్లి ప్రస్తావన గురించి డిమాండ్ చేశారు. అంతేకాక […]

  • Published On:
Prabhas Marriage : వచ్చే ఏడాది కల్లా ప్రభాస్ పెళ్లి కచ్చితంగా చేస్తా…శ్యామలాదేవి సంచలన వ్యాఖ్యలు…

Prabhas Marriage : ప్రస్తుత కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరి పెళ్లిళ్లు చేసుకుంటూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ తన పెళ్లిపై ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పకుండా అభిమానులను డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నారు. భారీ భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించినప్పటికీ పెళ్లి కూడా చేసుకుంటే బాగుండు అని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు పెళ్లి ప్రస్తావన గురించి డిమాండ్ చేశారు. అంతేకాక ఏ ఇంటర్వ్యూలో కనిపించిన పెళ్లి ఎప్పుడు అంటూ ప్రభాస్ ను అడగటం మొదలుపెట్టారు. ఇక ఎవరు ఎన్నిసార్లు అడిగినా చిన్న చిరునవ్వుతో ప్రభాస్ వాటిని దాటేస్తూ ఉంటాడు. అయితే తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

prabhas-will-definitely-get-married-by-next-year-shyama-devis-sensational-comments

అయితే తాజాగా దేవి నవరాత్రుల్లో భాగంగా కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి విజయవాడలోని శ్రీ కనకదుర్గ దేవిని దర్శించుకోవడానికి ఇటీవల కొండకు వచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇక అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం శ్యామలాదేవి మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విలేకరులు ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా …సానుకూలంగా స్పందించిన శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే మా ఇంట్లో ఒక శుభకార్యం జరగనుందని…నా భర్త లేకపోయినప్పటికీ ఆయన పేరును నిలబెట్టే విధంగా ప్రభాస్ మా కుటుంబం పేరును ముందుకు తీసుకెళ్తున్నాడని తెలియజేసింది.

prabhas-will-definitely-get-married-by-next-year-shyama-devis-sensational-comments

అయితే కృష్ణంరాజు గారు బ్రతికున్నప్పుడే ప్రభాస్ పెళ్లి చేయాలనుకున్నాం కానీ అప్పుడు ప్రభాస్ వరుసగా సినిమాలను ఒప్పుకోవడం..ఇక షూటింగ్స్ లో చాలా బిజీగా ఉండటం వలన కుదరలేదు అని చెప్పుకొచ్చింది. ఇక వచ్చే ఏడాది దసరాలోపు ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే అమ్మాయి ఎవరు అనే విషయాలను బయట పెట్టకపోయినప్పటికీ ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందని శ్యామలాదేవి చెప్పడంతో ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ పెళ్లి గురించి చెప్పడంతో కచ్చితంగా నిజమే అని ఉప్పొంగిపోతున్నారు.