Hero Nani : హీరోయిన్లతో లిప్ లాక్ సీన్స్…ఇంట్లో భార్య గొడవపై హీరో నాని సంచలన కామెంట్స్…

Hero Nani : డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోగా మారిన నాచురల్ స్టార్ నాని వరుసగా మంచి హిట్ సినిమాలు తీస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీ లో తన కంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నాని నటించిన దసరా సినిమా అయితే ఏకంగా 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి నాని కెరియర్ లో ఎక్కువ […]

  • Published On:
Hero Nani :  హీరోయిన్లతో లిప్ లాక్ సీన్స్…ఇంట్లో భార్య గొడవపై హీరో నాని సంచలన కామెంట్స్…

Hero Nani : డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోగా మారిన నాచురల్ స్టార్ నాని వరుసగా మంచి హిట్ సినిమాలు తీస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీ లో తన కంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నాని నటించిన దసరా సినిమా అయితే ఏకంగా 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి నాని కెరియర్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సమయంలో నాని కొత్త దర్శకుడు అయిన శౌర్య తో నాని 30 సినిమాగా హాయ్ నాన్న అనే సినిమాను చేస్తున్నాడు.

nani-about-his-wife-reaction-on-hi-nanna-lip-lock-scene

ఇక ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర విడుదల చేయడంం జరిగింది. అలాగే టీజర్ ఈవెంట్ లో ఇటీవల పాల్గొన్న నాని ఈ సినిమా గురించి మీడియాతో ప్రస్తావించారు. ఇక దానిలో భాగంగా అక్కడ ఉన్న ఓ మీడియా రిపోర్టర్ నానితో ఈ మధ్య మీరు చేస్తున్న సినిమాలలో లిప్ కిస్ లు ఎక్కువగా ఉంటున్నాయి ఏంటి ..మీరే కావాలని డైరెక్టర్లతో చెప్పి పెట్టిస్తున్నారా లేక డైరెక్టర్ కావాలని పెడుతున్నారా అని అడిగాడు. దాంతో నాని దానికి సమాధానం ఇస్తూ అన్ని సినిమాలు కాదండి.. నేను చేసిన ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని,

nani-about-his-wife-reaction-on-hi-nanna-lip-lock-scene

లాస్ట్ టైం నేను చేసిన దసరా సినిమాలో లిప్ లాక్ సీన్ లేదు. , దానికంటే ముందు అంటే సుందరానికి సినిమా చేసా.. దాంట్లో కూడా లేదు.ఒక నటుడుగా డైరెక్టర్ ఏదైతే కోరుకుంటాడో అది ఇవ్వడంలో 100% సక్సెస్ అవ్వాలి. ఈ లిప్ లాక్ సీన్స్ అనేవి నేను డిమాండ్ చేయడం వల్ల కాదు..సినిమాకి కచ్చితంగా డిమాండ్ చేస్తుంది అంటేనే చేస్తాము అంటూ నాని చెప్పుకోచ్చాడు. అలాగే ఇలాంటి సీన్స్ చేసినప్పుడు ఇంటికి వెళితే ఈ విషయంపై కాస్త గొడవ కూడా అవుతుందని నాని తెలియజేసాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా అరవడం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో నాని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోని దీనికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది.