Roja : బండారుని బజారుకిడుస్తా…సుప్రీంకోర్టు కెల్లడానికైనా సిద్ధం.

Roja  : ఇటీవల ఏపీ పర్యటశాఖ మంత్రి రోజాను ఉద్దేశించి టిడిపి నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా మరోసారి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు చేసిన తప్పులను డైవర్ట్ చేయడానికి టిడిపి నేత బండారు తనని టార్గెట్ చేశారని మంత్రి రోజ్ ఆరోపించారు. ఇక ఈ విషయంలో బండారుని అసలు వదిలిపెట్టనని, బండారి పై పరువు నష్టం దావా కేసు వేసి న్యాయం జరిగే వరకు పోరాడుతానని రోజ చెప్పుకొచ్చింది. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు […]

  • Published On:
Roja : బండారుని బజారుకిడుస్తా…సుప్రీంకోర్టు కెల్లడానికైనా సిద్ధం.

Roja  : ఇటీవల ఏపీ పర్యటశాఖ మంత్రి రోజాను ఉద్దేశించి టిడిపి నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా మరోసారి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు చేసిన తప్పులను డైవర్ట్ చేయడానికి టిడిపి నేత బండారు తనని టార్గెట్ చేశారని మంత్రి రోజ్ ఆరోపించారు. ఇక ఈ విషయంలో బండారుని అసలు వదిలిపెట్టనని, బండారి పై పరువు నష్టం దావా కేసు వేసి న్యాయం జరిగే వరకు పోరాడుతానని రోజ చెప్పుకొచ్చింది. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తానని బండారు లాంటి వ్యక్తులకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని రోజా డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన ప్రతినిధులు దిగజారిన రాజకీయాలను చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.

minister-roja-once-again-strongly-reacted-to-bandaru-satyanarayanas-comments

ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబును బయటకు తీసుకు రాలేకపోతున్న టిడిపి నేతలు.. దానిని డైవర్ట్ చేసేందుకు నన్ను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా మాట్లాడుతూ….నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇంతవరకు ఇంత నీచంగా ఇంత దరిద్రంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఏ సాధారణ మహిళను ఉద్దెశించి అయినా సరే ఒక మగాడు ఇలా దిగజారి మాట్లాడాలంటే భయపడేలా మహిళా సంఘాలు కలిసి పోరాడాలి. ఈ నేపథ్యంలోనే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. దీనిని నేను ఏమాత్రం వదిలిపెట్టను. దీని కోసం లీగల్ గా ఎంత దూరమైనా వెళ్తా. సుప్రీంకోర్టు వరకైనా వెళ్లడానికి నేను రెడీ అంటూ రోజా తేల్చి చెప్పారు.

minister-roja-once-again-strongly-reacted-to-bandaru-satyanarayanas-comments

ఇది ఇలా కొనసాగుతుండగా మంత్రి రోజా పై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు పలువురు మహిళలు కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు జాతీయస్థాయి నేతలు రోజాకు మద్దతుగా నిలబడ్డారు. రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలైన మీనా రమ్యకృష్ణ రోజాకు మద్దతుగా నిలిచి రోజాకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎంపీ సినీనటి నవనీత్ కౌర్ సైతం రోజాకు మద్దతుగా నిలిచారు. అలాగే నటిమని రాధిక , ఖుష్బూ కూడా ఇటీవల రోజాకు మద్దతుగా ఉంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.