Viral News : రెక్కల ముక్కలు చేసుకుని మరి భార్యను చదివిస్తే …..చివరికి ఏం చేసిందో చూడండి…వైరల్ న్యూస్..

Viral News : ఓ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కలలను నెరవేర్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని మరి రాత్రి పగలు కష్టపడ్డాడు. ఎంతో కష్టం చేసి రూపాయి రూపాయి సంపాదించి భార్య చదువుకి ఖర్చు చేశాడు. భర్త ప్రోత్సాహంతో భార్య బాగా చదువుకుని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ అయింది. అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎప్పుడైతే తనకు జాబ్ వచ్చిందో అప్పటినుండి తన భర్తను చులకనగా చూడడం మొదలుపెట్టింది. అంతేకాక […]

  • Published On:
Viral News : రెక్కల ముక్కలు చేసుకుని మరి భార్యను చదివిస్తే …..చివరికి ఏం చేసిందో చూడండి…వైరల్ న్యూస్..

Viral News : ఓ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కలలను నెరవేర్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని మరి రాత్రి పగలు కష్టపడ్డాడు. ఎంతో కష్టం చేసి రూపాయి రూపాయి సంపాదించి భార్య చదువుకి ఖర్చు చేశాడు. భర్త ప్రోత్సాహంతో భార్య బాగా చదువుకుని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ అయింది. అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎప్పుడైతే తనకు జాబ్ వచ్చిందో అప్పటినుండి తన భర్తను చులకనగా చూడడం మొదలుపెట్టింది. అంతేకాక తాను పనిచేసే ఆఫీసులో మరో అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక ఈ విషయం తెలుసుకొని నిలదీసిన భర్తను వరకట్నం వేదింపులు అనే కేసు లో ఇరికించి జైలుకు పంపింది. అయితే ఇటీవల బెయిల్ పై వచ్చిన భర్త ఆమెపై న్యాయపోరాటం ప్రారంభించాడు. ఇదంతా వింటుంటే ఏదో సినిమా స్టోరీ లా ఉంది కదా…కానీ ఇది నిజం..పూర్తి వివరాల్లోకెళ్తే..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో ప్రయాగ్ రాజ్ కు చెందిన అలోక్ మౌర్య అనే వ్యక్తి తన భార్య కలను నెరవేర్చేందుకు ఎంతగానో కృషి చేశాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తనకు వచ్చిన శాలరీ మొత్తాన్ని భార్య చదువుకు వినియోగించాడు. అంతేకాక అప్పులు చేసి మరి తన భార్యను మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసి చదివించాడు. భర్త ప్రోత్సాహం లభించడంతో బాగా చదివిన జ్యోతి పరీక్ష రాసి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఉద్యోగాన్ని సాధించింది. అయితే అప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. చిన్న ఉద్యోగం చేసే తన భర్త పై ఆమెకు చులకనా భావం ఏర్పడింది.

దీంతో భర్తకు తెలియకుండా తనతో పాటు పనిచేసే మరో ఆఫీసర్ తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అలోక్ ఏంటిది అని ప్రశ్నించగా …తన భర్త పై వరకట్నం వేధింపుల కేసు పెట్టి జైలుకు పంపింది. అయితే ఇటీవల బెయిల్ పై అలోక్ బయటకు వచ్చాడు. అలోక్ బయటకి రావడం తెలుసుకున్న అతని భార్య జ్యోతి విడాకులు ఇవ్వాల్సిందిగా కోరుతూ పదేపదే ఇబ్బంది పెడుతూ వచ్చింది. అయితే అతను జైలుకు వెళ్లి రావడం వలన అతని ఉద్యోగం కూడా పోయింది. తన భార్య కోసం ఇంత చేసినప్పటికీ తను చేసిన దానికి ,జ్యోతి పై ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అలోక్ తన బాధను మీడియాతో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. ఈ న్యూస్ తెలుసుకున్న నేటి జనులు ఇలాంటి దాన్ని చంపిన పాపం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.