Ayodhya Ram Mandir : వారంలోనే తిరుపతి వెంకన్న రికార్డుని బద్దలు కొట్టిన అయోధ్య రామయ్య…

Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ 22న ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు . అయితే ఈ కార్యక్రమానికి దేశ వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవం చూశారు. ఇది ఇలా ఉండగా ప్రాణ ప్రతిష్ట తర్వాత రోజు నుండి అంటే జనవరి 23న సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచ్చుకున్నాయి. వారం రోజుల్లో ఏకంగా […]

  • Published On:
Ayodhya Ram Mandir : వారంలోనే తిరుపతి వెంకన్న రికార్డుని బద్దలు కొట్టిన అయోధ్య రామయ్య…

Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ 22న ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు . అయితే ఈ కార్యక్రమానికి దేశ వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవం చూశారు. ఇది ఇలా ఉండగా ప్రాణ ప్రతిష్ట తర్వాత రోజు నుండి అంటే జనవరి 23న సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచ్చుకున్నాయి. వారం రోజుల్లో ఏకంగా 19 మంది లక్షల భక్తులు అయోధ్య రాములల్లా ను దర్శించుకున్నారు. సగటున ప్రతిరోజు రెండు లక్షల కన్నా ఎక్కువ మంది భక్తులు రాముని దర్శించుకున్నట్లు అయోధ్య ఆలయ ట్రస్టు తెలిపింది.

ఉత్తరప్రదేశ్ నుండే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. జనవరి 23న ఆలయాన్ని తెరిచిన మొదటి రోజు నుంచే 5 లక్షల మంది భక్తులు పూజలు చేయడం వలన రద్దీ ఎక్కువగా ఉంది. తర్వాత 24 వ తేదీన రెండు లక్షల 50 వేల మంది భక్తుల నుంచి 3 లక్షల మంది భక్తులు 26న 3లక్షల మంది భక్తులు 27న రెండు లక్షల 50 వేల మంది భక్తులు 28న 3 లక్షల 28 వేల మంది భక్తులు రాముని దర్శించుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు భక్తుల కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను గమనించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇలా వారంలోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న వారి కంటే అయోధ్యకు తరలివచ్చిన భక్తులే ఎక్కువ గా ఉండడం గమనార్హం.