Ileana D’cruz : కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ మురిసిపోతున్న ఇలియానా….అప్పుడే రెండు నెలలు…

Ileana D’cruz : గోవా హాట్ బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం తెలిసిందే. అయితే తాను గర్భవతి అనే విషయం ఆమె చెప్పేంతవరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పుడు ఇలియానా భర్త ఎవరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అంతేకాక ఇలియానా పై కూడా చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. అయిన కానీ ఇలియానా మాత్రం అవేమి పట్టించుకోకుండా తన బేబీ బంప్ […]

  • Published On:
Ileana D’cruz : కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ మురిసిపోతున్న ఇలియానా….అప్పుడే రెండు నెలలు…

Ileana D’cruz : గోవా హాట్ బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం తెలిసిందే. అయితే తాను గర్భవతి అనే విషయం ఆమె చెప్పేంతవరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పుడు ఇలియానా భర్త ఎవరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అంతేకాక ఇలియానా పై కూడా చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. అయిన కానీ ఇలియానా మాత్రం అవేమి పట్టించుకోకుండా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఆనందాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. ఇక ఆ మధ్య ఒకసారి ఓ వ్యక్తి ఫోటోలను షేర్ చేసింది, కానీ అతని వివరాలు ఏమి చెప్పలేదు. దీంతో చాలామంది అతనే ఇలియానా ప్రియుడని అనుకున్నారు.

leana-shares-adorable-photo-with-son-he-turns-2-months-old

అయితే తాజాగా ఆగస్టు 1 ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తన కొడుకుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అతని పేరు కోవా ఫోనిక్స్ డోలన్ గా చెప్పుకొచ్చింది. ఇక ఈ పేరుకు గల అర్థమేంటి అనేది కూడా ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇప్పటికీ ఇలియానా తన భర్త పేరు మరియు వివరాలను చెప్పకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 1తో ఇలియానా కొడుకు డోలను రెండు నెలలు పూర్తయ్యాయి. ఇక ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలియానా ఆనందాన్ని వ్యక్తం చేసింది.  తన భుజంపై సేద తీరుతున్న కొడుకుతో సెల్ఫీ తీసుకున్న ఇలియానా ఫోటోలను షేర్ చేస్తూ అప్పుడే రెండు నెలలు గడిచిపోయాయంటూ రాస్కొచ్చింది.

leana-shares-adorable-photo-with-son-he-turns-2-months-old

మరోసారి కొడుకు ఫోటోలను రివిల్ చేయడంతో ఇలియానా పోస్ట్ పై సినీ సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తున్నారు. క్యూట్ బేబీ బెస్ట్ మదర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇలియానా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలియానా ఇప్పటికీ తన భర్త పేరును గోప్యంగా ఎందుకు ఉంచుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్త పద్ధతులను అనుసరించి బిడ్డకు జన్మనిచ్చిందా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ అసలు విషయాలను ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)