kerala farmer sujeeth : ఆడి కార్లో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న రైతు…

kerala farmer sujeeth : సాధారణంగా రైతులు వారు పండించిన పంటను మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయించడం మనం చూస్తూనే ఉంటాం. పంట పండించడం ఒక ఎత్తు అయితే పండిన పంటను మార్కెట్లో విక్రయించడం మరో ఎత్తు అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో పెట్టిన పెట్టుబడికి పంట అమ్మగా వచ్చిన రాబడి కి సంబంధం కూడా ఉండదు. ఈ క్రమంలోనే రైతులు అప్పులు నష్టాలలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొందరు రైతులు మాత్రం […]

  • Published On:
kerala farmer sujeeth : ఆడి కార్లో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న రైతు…

kerala farmer sujeeth : సాధారణంగా రైతులు వారు పండించిన పంటను మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయించడం మనం చూస్తూనే ఉంటాం. పంట పండించడం ఒక ఎత్తు అయితే పండిన పంటను మార్కెట్లో విక్రయించడం మరో ఎత్తు అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో పెట్టిన పెట్టుబడికి పంట అమ్మగా వచ్చిన రాబడి కి సంబంధం కూడా ఉండదు. ఈ క్రమంలోనే రైతులు అప్పులు నష్టాలలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొందరు రైతులు మాత్రం వినూత్న పద్ధతులలో వ్యవసాయాలు చేస్తూ భారీ లాభాలను పొందుతున్నారు. ఇక అలాంటి రైతు గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే అతను సాధారణ వాహనాలలో కాకుండా ఏకంగా 44 లక్షల విలువ చేసే ఆడి ఏ4 కారు లో తాను పండించిన పంటను తీసుకువచ్చి మార్కెట్లో విక్రయిస్తుంటాడు.

Sunflower Farming Helps This Kerala Farmer Earn Rs 10 Lakh Every Season

అతనే కేరళవాసి 36 ఏళ్ల వయసుగలల సుజిత్ . ప్రస్తుతం సుజిత్ కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఎందుకంటే అతను సాధారణ వాహనాల్లో కాకుండా ఖరీదైన కార్ లో కూరగాయలను అమ్మేందుకు మార్కెట్ కు వచ్చి కూరగాయలను తీసి చాప మీద పరిచి మార్కెట్లో విక్రయిస్తాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే సుజిత్ కు స్థానికంగా సోషల్ మీడియాలో చాలా అకౌంట్స్ ఉన్నాయట. ఇక అతను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా వెరైటీ ఫార్మర్ అని ఉండటం గమనార్హం. అయితే సుజిత్ అందరిలా కాకుండా విభిన్న పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. రకరకాల పంటలను పండిస్తూ తన వ్యవసాయానికి సరికొత్త టెక్నాలజీని ఆధ్యాత్మిక పద్ధతులను జోడించి వ్యవసాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.అందుకుగాను అతనికి కొన్ని అవార్డ్స్ కూడా లభించాయి.

After Israel-model, Sujith turns to tunnel farming in Kerala- The New Indian Express

అలాగే తాను చేసే వ్యవసాయ పద్ధతులను మిగతా రైతులకు కూడా అవగాహన కల్పించే విధంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు. అయితే ఈ వ్యవసాయం చేయడానికి ముందు సుజిత్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే వాడట. ఇక అందులో లాభం రాకపోవడంతో వ్యవసాయం చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తనకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువతో మరికొంత భూమిని కౌలుకు పండించడం మొదలుపెట్టాడు. అధిక రాబడి వచ్చే పంటలను ఎంచుకొని వినూత్న పద్ధతిలో సరైన మార్కెటింగ్ చేయడంతో వ్యవసాయ రంగంలో సుజిత్ సక్సెస్ అయ్యాడు. ఇలా స్థానికంగా ఎంతో పేరు సంపాదించుకున్న సుజిత్ వెరైటీ ఫార్మర్ గా పేరు పొందాడు. సుజిత్ కదా ఎంతోమంది యువ రైతులకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తే ఎప్పటికైనా విజయం సాధిస్తారని సుజిత్ నిరూపించాడు.