Viral News : జడ వేసుకోకుండా వచ్చారని జుట్టు కత్తిరించిన టీచర్…..ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు….

Viral News : ఇటీవల కాకినాడ స్కూల్లో ఓ సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకుని క్లిప్పులు పెట్టుకుని వస్తున్నారని క్లాస్ టీచర్ వారి జుట్టును కత్తిరించడం సంచలనంగా మారింది. అయితే నగరంలోని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినిలు జడ వేసుకోకుండా ఎయిర్ ను స్టైల్ గా వదిలేసి రోజు స్కూల్ కి వస్తున్నారు. ఇక వారి ఎయిర్ స్టైల్ పై ఆగ్రహించిన […]

  • Published On:
Viral News : జడ వేసుకోకుండా వచ్చారని జుట్టు కత్తిరించిన టీచర్…..ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు….

Viral News : ఇటీవల కాకినాడ స్కూల్లో ఓ సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకుని క్లిప్పులు పెట్టుకుని వస్తున్నారని క్లాస్ టీచర్ వారి జుట్టును కత్తిరించడం సంచలనంగా మారింది. అయితే నగరంలోని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినిలు జడ వేసుకోకుండా ఎయిర్ ను స్టైల్ గా వదిలేసి రోజు స్కూల్ కి వస్తున్నారు. ఇక వారి ఎయిర్ స్టైల్ పై ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు మంగాదేవి గత కొన్ని రోజులుగా వారిని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ టీచర్ మాటలు లెక్క చేయని విద్యార్థినిలు కొందరు బుధవారం రోజు జడలు వేసుకోకుండా జుట్టు విరబోసుకొని తరగతి గదులకు హాజరయ్యారు.

Kakinada Teacher Cuts Students Hair,కాకినాడ: స్కూల్లో 8మంది విద్యార్థినిల జుట్టు కత్తిరించిన ఉపాధ్యాయురాలు.. వింత కారణంతో పైశాచికం! - school teacher cuts off girl students ...

ఇక ఇది గమనించిన ఉపాధ్యాయులు మంగాదేవి చదువుకోడానికి వచ్చారా… లేక సోకులు పడడానికి వచ్చారా అంటూ…8 మంది విద్యార్థినుల జుట్టును చివర కొంతమేర కత్తిరించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయురాలుపై చర్యలు తీసుకోవాలని ఆందోళనన చేపట్టారు. ఇక ఈ విషయంలో స్థానిక అధికారులు కలుగజేసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పి వారిని శాంతింపచేశారు. ఇక ఈ వ్యవహారంపై డిఇఓ కు నివేదిక అందజేసినట్లుగా కాకినాడ అర్బన్ ఎంఈ. మరియు డివై ఈఓ తెలియజేశారు. ఆ తర్వాత బాధితురాల్ల నుండి వాగ్మూలాన్ని తీసుకొని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. ఇక ఈ నివేదికకు స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు చట్టపరమైన చర్యల్లో భాగంగా ఉపాధ్యాయురాలు మంగాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.