Software Couple : విడాకుల కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన భార్యాభర్తలు… ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది…

Software Couple : వారిద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు..ఒకరు ఉదయం డ్యూటీ కి వెళ్తే.. ఒకరు రాత్రి వేళ డ్యూటీకి వెళుతుంటారు. వారిద్దరూ కలిసి ఇంట్లో ఉండడం అనేది చాలా రేర్ అన్నమాట. వీరి పెళ్లయినప్పటి నుండి ఇదే తతంగం నడుస్తుంది. ఇంకా ఇలా ఉన్న వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుగా.. అలాంటి వారికి వారి వివాహ బంధం గురించి , వారి ప్రేమానురాగాలు గురించి తెలుసుకునే ఛాన్స్ ఎక్కడ ఉంది. దీంతో ఇద్దరు […]

  • Published On:
Software Couple : విడాకుల కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన భార్యాభర్తలు… ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది…

Software Couple : వారిద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు..ఒకరు ఉదయం డ్యూటీ కి వెళ్తే.. ఒకరు రాత్రి వేళ డ్యూటీకి వెళుతుంటారు. వారిద్దరూ కలిసి ఇంట్లో ఉండడం అనేది చాలా రేర్ అన్నమాట. వీరి పెళ్లయినప్పటి నుండి ఇదే తతంగం నడుస్తుంది. ఇంకా ఇలా ఉన్న వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుగా.. అలాంటి వారికి వారి వివాహ బంధం గురించి , వారి ప్రేమానురాగాలు గురించి తెలుసుకునే ఛాన్స్ ఎక్కడ ఉంది. దీంతో ఇద్దరు విడాకులకు రెడీ అయిపోయారు. మాకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ దంపతులు తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విడాకుల కోసం దాఖలాలు పెట్టుకున్నారు.

husband-and-wife-who-went-to-the-supreme-court-for-divorce-the-supreme-court-lawyer-gave-an-unexpected-twist

ఇక అక్కడ వారి కేసును పరిశీలించిన జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న తో విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ సాఫ్ట్ వేర్ దంపతులకు కీలక సూచన చేసింది. ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు సమయం కేటాయించలేదని, మీ వివాహ బంధానికి రెండోసారి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది.. దంపతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఒకరు పగల డ్యూటీ మరొకరు రాత్రి డ్యూటీ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య అనుబంధానికి సమయం దొరకలేదు? అలాంటప్పుడు మీరు కలిసి ఉండటానికి మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.

husband-and-wife-who-went-to-the-supreme-court-for-divorce-the-supreme-court-lawyer-gave-an-unexpected-twist

ఇద్దరు కలిసి జీవనం చేసినందుకు మరో అవకాశం ఇవ్వచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే అప్పటి కే వారు సరేనా నిర్ణయానికి వచ్చినట్లు వారి న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నివేదించారు. కేసు విచారణ దశలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు మెడిటేషన్ కేంద్రానికి వెళ్లినట్లు దంపతులు తరఫున లాయర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాలు విడాకులకు అంగీకరించినట్లు తెలియజేశారు. అంతేకాక సెటిల్మెంట్ కింద భార్యకు భర్త 12.51 లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరించుకున్నారని దంపతులు తరఫున న్యాయవాదులు తెలియజేశారు. ఇక ఈ వాదనలను విన్న న్యాయస్థానం వారికి విడాకులను మంజూరు చేసింది .