Married Life : మీ దాంపత్య జీవితంలో ఈ తప్పులు చేస్తున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకోండి…

Married Life : మనదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . జీవితమంతా ఓకే భాగస్వామితో కలిసి ఉండటంతో ఇతర దేశస్తులు కూడా మన ఆచారాలపై మక్కువ చూపిస్తుంటారు. మన ఆచార వ్యవహారాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మన ఆచారలు విచ్చినమవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో రోజురోజుకీ విడాకులు తీసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇక పూర్వం రోజుల్లో భార్యాభర్తలకు ఇప్పుడున్న సమాజంలోని భార్యాభర్తలకు చాలా బేధాలు కనిపిస్తున్నాయి. మన […]

  • Published On:
Married Life : మీ దాంపత్య జీవితంలో ఈ తప్పులు చేస్తున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకోండి…

Married Life : మనదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . జీవితమంతా ఓకే భాగస్వామితో కలిసి ఉండటంతో ఇతర దేశస్తులు కూడా మన ఆచారాలపై మక్కువ చూపిస్తుంటారు. మన ఆచార వ్యవహారాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మన ఆచారలు విచ్చినమవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో రోజురోజుకీ విడాకులు తీసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇక పూర్వం రోజుల్లో భార్యాభర్తలకు ఇప్పుడున్న సమాజంలోని భార్యాభర్తలకు చాలా బేధాలు కనిపిస్తున్నాయి. మన పూర్వీకులు వందేళ్లు ఎలాంటి విభేదాలు లేకుండా జీవితాలను కొనసాగిస్తే ప్రస్తుతం కాలంలో చాలా మంది చిన్న చిన్న వాటికి సైతం గొడవలు పడుతూ విడిపోతున్నారు. దీనికి గల కారణం ఒకరిపై ఒకరికి , ప్రేమ లేకపోవడం అని చెప్పాలి. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే దంపతులిద్దరి మధ్య మంచి అవగాహన నమ్మకం ఉండాలి.

are-you-making-these-mistakes-in-your-married-life-but-know-these-things

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ,సంభాషణలతో వారిని అనుబంధాన్ని మరింత బలం చేసుకోవాలి. అయితే ఈ రోజుల్లో ఇలాంటి విభేదాలు రావడానికి గల భార్య భర్తలు ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోవడం. అలాగే భర్త భార్యకు భార్య భర్తకు కలిసి ఉండే క్షణాన్ని ఇవ్వలేకపోవడం. అందుకే వీలైనంత ఎక్కువగా మీ భాగస్వామితో కలిసి ఉండటానికి ప్రయత్నించండి. కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఒకరికి తోడుగా ఒకరు నిలబడతామని ధైర్యాన్నిస్తూ భాగస్వామితో కలిపి గడిపినట్లయితే ప్రేమ బంధం బలపడుతుంది. ఈ విధంగా ఇద్దరి మధ్య ఉన్న ఎడబాటును దూరం చేసుకోవచ్చు. కావున జీవిత భాగస్వామి విషయంలో అసలు పొరపాట్లు చేయకండి. అప్పుడప్పుడు వారికి నచ్చినవి చేస్తూ వారిని సమర్థిస్తూ మీ భాగస్వామితో ప్రేమగా గడిపినట్లయితే ఎట్టి పరిస్థితిలోనూ మీ మధ్య ఎడబాటు అనేది రాదు.