Bengaluru : వీడేం దొంగ రా బాబు…ఏకంగా బస్ స్టాప్ ని లేపేసాడు…

Bengaluru : తరచుగా మనం బస్ స్టాప్ లలో రైల్వే స్టేషన్లలో జేబు దొంగలను చూస్తూనే ఉంటాం. ఇలాంటివారు జన సమూహాలలో కలిసి తిరుగుతూ వారి వెనక నుండి జేబులను ఖాళీ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ మాత్రం ఏకంగా బస్ స్టాప్ కే యేసర పెట్టేసాడు. అసలు అక్కడ బస్ స్టాప్ ఉందా..! అనే సందేహం కలిగేలా చిన్న ఆనవాలు కూడా లేకుండా మొత్తాన్ని ఎత్తుకెళ్లాడు. అయితే ఈ విచిత్రమైన ఘటన బెంగళూరులో […]

  • Published On:
Bengaluru : వీడేం దొంగ రా బాబు…ఏకంగా బస్ స్టాప్ ని లేపేసాడు…

Bengaluru : తరచుగా మనం బస్ స్టాప్ లలో రైల్వే స్టేషన్లలో జేబు దొంగలను చూస్తూనే ఉంటాం. ఇలాంటివారు జన సమూహాలలో కలిసి తిరుగుతూ వారి వెనక నుండి జేబులను ఖాళీ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ మాత్రం ఏకంగా బస్ స్టాప్ కే యేసర పెట్టేసాడు. అసలు అక్కడ బస్ స్టాప్ ఉందా..! అనే సందేహం కలిగేలా చిన్న ఆనవాలు కూడా లేకుండా మొత్తాన్ని ఎత్తుకెళ్లాడు. అయితే ఈ విచిత్రమైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

bus-stop-stole-in-bangaluru

బెంగళూరులోని కన్నింగ్ హమ్ రోడ్డు ఎప్పుడూ కూడా వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ బెంగళూరు మెట్రో పోలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రజలకు వీలుగా ఉండేందుకు కొత్తగా బస్ స్టాప్ లో షెల్టర్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 10 లక్షల విలువైన సామాగ్రితో , అధునాతన వసతులతో దీనిని నిర్మించినట్లు సమాచారం. అయితే ఈ బస్సు షెల్టర్ నిర్మించిన వారం రోజుల్లోనే ఓ దొంగ దానిని లుటీ చేశాడు. ఏ దొంగ కళ్ళు పడ్డాయో తెలియదు కానీ అదును చూసి ఎవరూ లేని సమయంలో బస్సు షెల్టర్ ను భాగాలుగా విడగొట్టి ఎత్తుకెళ్లాడు . ఇక ఈ ఘటనపై బస్ స్టాప్ ను నిర్మించిన కంపెనీ ప్రతినిధి ఎన్ రవిరెడ్డి మాట్లాడుతూ….

bus-stop-stole-in-bangaluru

కాఫీ డే కి దగ్గర లో మేము ఒకబస్సు షెల్టర్ ను నిర్మించామని…ఇక దానిని ఆగస్టు 21న ప్రారంభించామని తెలియజేశారు. అయితే ప్రారంభించిన వారం రోజులకే అంటే ఆగస్టు 28వ తేదీ ఉదయం నాటికి బస్సు షెల్టర్ కనిపించకుండా మాయం అయిపోయిందని..ఇక ఈ విషయాన్ని స్థానికులు మీడియాకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చిందని తెలియజేశారు. ఇక ఈ ఘటనపై రవి రెడ్డి సెప్టెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేయగా…కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్ స్టాప్ ను ఉద్దేశపూర్వకంగానే తొలగించారా లేక ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డారా అనే విచారణలో కొనసాగిస్తున్నారు.