Viral Video : ఇంస్టాగ్రామ్ రీల్ కోసం అని పట్టాల మీదకు వెళ్లాడు…తీరా చూస్తే….

Viral Video  : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో నేటి యువత సోషల్ మీడియాలో లైక్స్ అండ్ వ్యూస్ కోసం ప్రాణాలను సైతం పనంగా పెడుతున్నారు. ఎలాగైనా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని వింత చేష్టలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి […]

  • Published On:
Viral Video : ఇంస్టాగ్రామ్ రీల్ కోసం అని పట్టాల మీదకు వెళ్లాడు…తీరా చూస్తే….

Viral Video  : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో నేటి యువత సోషల్ మీడియాలో లైక్స్ అండ్ వ్యూస్ కోసం ప్రాణాలను సైతం పనంగా పెడుతున్నారు. ఎలాగైనా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని వింత చేష్టలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ యువకుడు సినిమా తరహాలో రీల్స్ చేయడం కోసం రైలు వస్తున్న పట్టాల మీదకు వెళ్ళాడు.

కానీ ఎవరు ఊహించిన విధంగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని స్థానిక బారాబంకికి చెందిన 14 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే సరి కొత్తగా వీడియోస్ తీయాలనే ఉద్దేశంతో తన స్నేహితుడితో కలిసి రైలు పట్టాల వద్దకు వెళ్లారు. రైలు వచ్చే సమయంలో పట్టాల పక్కనే నడుస్తూ వీడియో తీసుకోవాలనేది వారి కాన్సెప్ట్ అనుకుంటా.. ఇక అదే తీవ్ర ప్రమాదానికి దారితీసింది. ఇక యువకుడు రైలు వస్తున్న పట్టాల పక్కన నిలబడి నడుస్తూ ఉండగా స్నేహితుడు దూరంగా ఉన్నాడు. వెనక నుండి రైలు వస్తుంది.

ఆ టైంలో యువకుడు పట్టాలకు మరింత దగ్గరగా వెళ్ళాడు. తన స్నేహితుడు మొబైల్ లో రికార్డ్ చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఆ యువకుడిని ఢీ కొట్టింది. దీంతో యువకుడు గాలిలో లేచి దూరంగా ఎగిరిపడ్డాడు. అయితే ఈ ప్రమాదంలో అతనికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ నేటి యువత చేస్తున్న చేష్టలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటివి చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయటం మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.