Shocking Video : కరెంటు ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు…ఏకంగా మొసలిని తీసుకొచ్చి ఏం చేశారో మీరే చూడండి…

Shocking Video  : ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కరెంటు కొరత సమస్యలను రైతులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటలన్నీ చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరెంటును రైతు సోదరులకు సరైన సమయాలలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కరెంటు కోతలను నిరిసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఈ […]

  • Published On:
Shocking Video : కరెంటు ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు…ఏకంగా మొసలిని తీసుకొచ్చి ఏం చేశారో మీరే చూడండి…

Shocking Video  : ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కరెంటు కొరత సమస్యలను రైతులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటలన్నీ చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరెంటును రైతు సోదరులకు సరైన సమయాలలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కరెంటు కోతలను నిరిసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎండిపోయిన పంటలను తీసుకుని వచ్చి విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. ఇక కర్ణాటక పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఎప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండే రైతులు ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా కర్ణాటకకు చెందిన రామచూర్ రైతులు చూపించారు. అయితే తాజాగా విజయపుర్ రైతులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఏకంగా మొసలిని విద్యుత్ కార్యాలయంలో వదిలిపెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విజయపుర్ జిల్లా కోల్హారా తాలూకా రోనిహల్ గ్రామానికి చెందిన రైతులు ట్రాక్టర్ పై ఓ మొసలిని పట్టుకొచ్చి విద్యుత్ సబ్ స్టేషన్ యూనిట్ ఆవరణలో వదిలిపెట్టారు. ఇక ఈ మొసలి తోకకు ఒక తాడును మరియు మెడకు ఒక తాడును తగిలించి విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో తిప్పుతూ నిరసనలు చేపట్టారు. అయితే ఈ మొసలిని రైతులు రాత్రి సమయంలో వారు పొలం వద్ద చూసి పట్టుకొచ్చినట్లుగా తెలియజేశారు.

Crocodile scare for farm workers

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…రాత్రి వేల కరెంటు చాలా ఆలస్యంగా ఇస్తున్నారని , చీకటిలో పొలానికి వెళ్లడం వలన పాముకాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అలాగే మొసలి వంటి ప్రమాదకరమైన జంతువుల నుండి అపాయం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇక కరెంటు ఇచ్చేది తక్కువ అయితే రాత్రి వేళ ఇవ్వడం ఎందుకంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో రైతులకు పొలం వద్ద పొంచి ఉన్న అపాయాలను చూపించే విధంగా మొసలిని పట్టుకొచ్చి రైతులు ఆందోళన చేపట్టా రు. చివరికి అటవీశాఖ అధికారులు ఆ మొసలిని పట్టుకుని వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.