Ram Mandir Pran Prathishta : ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటో తెలుసా… సనాతన ధర్మంలో దీనికింత ప్రాధాన్యత ఎందుకంటే…?
Ram Mandir Pran Prathishta : భారతదేశ చరిత్ర పుట్టలో నిలిచిపోయే రోజు రానే వచ్చింది. ఎన్నో వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల కళ నెరవేరబోతుంది. ఏళ్ల నాటి వివాదాలకు తెరపడిన అయోధ్య రాముడు ఆలయంలో కొలువుదీరే చారిత్రక రోజు రానే వచ్చింది. అదే జనవరి 22. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అయోధ్యలో సందడి కనిపిస్తోంది. ఉత్సవానికి జరగాల్సిన వేడుకలు అన్ని ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మొత్తం క్రూతువు లో అత్యంత కీలకమైన ఘట్టం […]
Ram Mandir Pran Prathishta : భారతదేశ చరిత్ర పుట్టలో నిలిచిపోయే రోజు రానే వచ్చింది. ఎన్నో వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల కళ నెరవేరబోతుంది. ఏళ్ల నాటి వివాదాలకు తెరపడిన అయోధ్య రాముడు ఆలయంలో కొలువుదీరే చారిత్రక రోజు రానే వచ్చింది. అదే జనవరి 22. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అయోధ్యలో సందడి కనిపిస్తోంది. ఉత్సవానికి జరగాల్సిన వేడుకలు అన్ని ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మొత్తం క్రూతువు లో అత్యంత కీలకమైన ఘట్టం బాల రాముని ప్రాణ ప్రతిష్ట అని చెప్పాలి. ఇక ఈ సమయం కోసమే భారతదేశం లోని హిందువులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఘట్టం పూర్తయిన తర్వాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనం ఇస్తాడు. ఇక అప్పటి వరకు రామునీ విగ్రహం ఒక శిల మాత్రమే. ప్రాణ ప్రతిష్ట ఘట్టం పూర్తయిన తర్వాతే విగ్రహాన్ని ఆరాధ్య మూర్తిగా కొలుస్తారు.
అందుకే హిందూ ధర్మంలో ప్రాణప్రతిష్ట క్రుతువు కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక ఆ పేరు లోనే అర్థమవుతుంది కదా ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటో… అప్పటివరకు కేవలం ఒక రాతి శిల్పంగా ఉన్న విగ్రహం.. ఒకసారి గర్భగుడిలో ప్రతిష్టించిన తర్వాత ప్రాణం వచ్చి చేరుతుంది. అయితే ఏ దేవత మూర్తిని అక్కడ ప్రతిష్టిస్తారో ఆయన స్వయంగా ఆ విగ్రహంలో కొలువు తీరుతాడని నమ్మకం. అందుకే సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకి ఎంతో ఆదరణ విశిష్టత ఉంది. అయితే ప్రారంభించే ప్రతి ఆలయంలో కూడా ఇది తప్పకుండా జరిగే ప్రక్రియ. ప్రాణం అంటే జీవం.. ప్రతిష్ట అంటే పోయడం. అంటే విగ్రహానికి ప్రాణం పోయడం అన్నమాట. ఆ విగ్రహంలోకి ఆరాధ్యామూర్తిని ఆవహింప చేస్తారు.
ఇక ఆ సమయంలోనే వేదమంత్రాలు పటిస్తూ మంత్రాలు చదువుతుండగానే దైవం నేరుగా వచ్చి విగ్రహం లోకి ఐక్యం అవుతుందని నమ్మకం. అంత కీలకమైన ప్రక్రియ కాబట్టే ఈ ప్రక్రియ సమయానికి ముహూర్తం చాలా కచ్చితంగా ఉంటుంది. అయోధ్య రామ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమథనం చేసి ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 మధ్యకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొత్తంగా 84 సెకండ్ల పాటు కొనసాగే ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే మహా పూజ మహా హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకే సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ఆదరణ ఉంది.